పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగ‌స్వామి ప్ర‌మాణం

5వ సారి వ‌రుస‌గా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఎన్

పుదుచ్చేరి : ఎన్. రంగ‌స్వామి అరుదైన ఘ‌న‌త‌ను సాధించారు. ఆయ‌న వ‌రుస‌గా పుదుచ్చేరి రాష్ట్రానికి ఐదోసారి సీఎంగా ప‌ని చేయ‌నున్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అత్యంత సామాన్యమైన జీవితం గ‌డిపే త‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎలాంటి భేష‌జాలు , ప్ర‌ద‌ర్శ‌న‌లు లేకుండా చాలా సింపుల్ గా ఉండేందుకు ఇష్ట ప‌డ‌తారు. ఆయ‌న ప్ర‌జ‌ల నాయ‌కుడిగా పేరు పొందారు.

పుదుచ్చేరి రాజ‌కీయాల‌లో త‌న‌దైన ముద్ర వేశారు. సీనియర్ రాజకీయ నాయకుడైన ఎన్ రంగ‌స్వామి AINRC వ్యవస్థాపకుడు. బుధవారం నాడు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఐదవసారి ప్రమాణ స్వీకారం చేయ‌డం విశేషం. AINRC నేతృత్వంలోని NDA ప్రభుత్వంలో మంత్రులుగా, మరో ఇద్దరు క్యాబినెట్ సభ్యులు కొలువు తీరారు. ఇక ప్రాంతీయ పార్టీకి చెందిన మల్లాడి కృష్ణారావు , భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎ. నమశ్శివాయం కూడా ప్రమాణ స్వీకారం చేశారు సీఎంతో పాటు. ముఖ్యమంత్రితో పాటు ఆయన క్యాబినెట్ సహచరులతో లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాష్ నాథన్ పదవీ ప్రమాణం చేయించారు.

రంగస్వామి దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. కృష్ణారావు తెలుగులో ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పుదుచ్చేరి ఎన్‌క్లేవ్ అయిన యానం నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వేదికపై BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ , సీనియర్ నాయకుడు బి.ఎల్. సంతోష్ కూడా పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించి, అధికారాన్ని నిలబెట్టుకుంది. రంగస్వామిని ముఖ్యమంత్రిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు.

Leave A Reply

Your Email Id will not be published!