ఏపీకి పెట్టుబ‌డుల వెల్లువ ఉద్యోగాల క‌ల్ప‌న

దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి

అమ‌రావ‌తి : ఏపీలో కొలువు తీరిన కూట‌మి స‌ర్కార్ తీసుకుంటున్న నిర్ణ‌యాల వ‌ల్ల భారీ ఎత్తున రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, నారా లోకేష్ క‌లిసి అన్ని దేశాలు తిరుగుతూ ఏపీని ప్రమోట్ చేస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అడుగుతున్నారు. నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం కోసం కష్టపడుతున్నారు అంతా క‌లిసి. రెండేళ్లలోనే అనేక పెద్ద కంపెనీలు ఏపీకి తీసుకు రావ‌డంలో స‌క్సెస్ అయ్యారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి రావ‌డం విశేషం. ఇది ఓ రికార్డు అని చెప్ప‌వ‌చ్చు. కొత్త కంపెనీలు తీసుకురావడం ఎంత ముఖ్యమో.. రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కూడా అంతే ముఖ్యం. కొత్త వాళ్లను కన్విన్స్ చేయడంతో పాటు మనదగ్గర ఉన్న కంపెనీలతో ఎక్స్ పాన్షన్ చేయించాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం అని పేర్కొన్నారు మంత్రి లోకేష్.

రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన వాళ్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తోంది ఏపీ స‌ర్కార్. అందుకే వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని రిక్వెస్ట్ లు వస్తున్నా.. వాళ్లు మాత్రం ఏపీనే ఎంచుకుంటున్నారు. ఈ రోజు దాల్మియా సిమెంట్స్ విస్తరణ జరగడానికి ప్రధాన కారణం ఇక్కడి రైతులు, కంపెనీని నడిపిస్తున్న ఉద్యోగులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, కార్మికులు. మీ అందరికీ అభినందనలు. కడప జిల్లా భవిష్యత్ కు మరో బలమైన పునాది వేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు చంద్ర‌బాబు , భ‌ర‌త్ , లోకేష్. న ప్రపంచం మొత్తం తిరిగి కంపెనీలు తీసుకొస్తాను. అది నా బాధ్యత. కానీ ఆ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చిన యువతపై కూడా బాధ్యత ఉంటుంది. మీ క్రమశిక్షణ, శ్రమించే తత్వం, మీ వ్యక్తిత్వం వల్ల మనకి మంచి పేరు వస్తుంది. మీరంతా కష్టపడి పనిచేస్తే మరిన్ని కంపెనీలు ఏపీకి వస్తాయని ప్ర‌క‌టించారు.

Leave A Reply

Your Email Id will not be published!