టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ గుడ్ బై

టాటా గ్రూపులో 40 ఏళ్ల వృత్తిప‌ర ప్ర‌యాణం

ముంబై : దిగ్గ‌జ సంస్థ‌గా పేరు పొందిన టాటా గ్రూప్ స‌న్స్ కు కోలుకోలేని రీతిలో దెబ్బ త‌గ‌ల‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు టాటా స‌న్స్ సంస్థ‌కు చైర్మ‌న్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ వచ్చారు ఎన్. చంద్ర‌శేఖ‌రన్. బుధ‌వారం ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సంస్థ‌లో40 ఏళ్ల పాటు వృత్తిప‌రంగా ప‌ని చేశాన‌ని తెలిపారు.
ఈ ప్రతిష్టాత్మక సంస్థకు నా వంతు కృషి చేసే అవకాశం లభించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా టాటా సన్స్‌కు నాయకత్వం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం , ఒక కీలకమైన బాధ్యత అని అన్నారు.

టాటా సన్స్ చైర్మన్‌గా నా ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగుస్తుంది. నా తదుపరి పదవీ కాలాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించాలని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట‌, ‘సర్ రతన్ టాటా ట్రస్ట్’ ఏకగ్రీవంగా తీర్మానించి సిఫార్సు చేశాయని తెలిపారు. దీనిని టాటా సన్స్ నామినేషన్ , రెమ్యూనరేషన్ కమిటీ అలాగే బోర్డు కూడా నమోదు చేసి సిఫార్సు చేశాయి. ఆ తర్వాత, 2026 ఫిబ్రవరి 24న టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఈ తీర్మానం ప్రవేశ పెట్టారు. అయితే, ఒక బోర్డు సభ్యుడు దీనికి మద్దతు ఇవ్వక పోవడంతో ఆ ప్రతిపాదన ఆమోదం పొందలేదని వెల్ల‌డించారు ఎన్ . చంద్ర‌శేఖ‌ర‌న్. ఏకగ్రీవ మద్దతు లేని కారణంగా, ఆ నిర్ణయాన్ని వాయిదా వేయాలని నేను నిర్ణయించుకున్నాను.

ఆ బోర్డు సమావేశం జరిగి ఆరు నెలలు గడిచినా, ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేద‌న్నారు. టాటా సన్స్ ఒక భారీ సంస్థ , అనేక వ్యూహాత్మక ప్రాజెక్టులు ప్రస్తుతం కీలక దశలో అమలు చేయబడుతున్నాయి. 2027 ఫిబ్రవరి తర్వాత కూడా గ్రూప్‌ను నడిపించడానికి ఒక నాయకుడు ఉండటం ఎంత అవసరమో, ఉద్యోగులు, పెట్టుబడిదారులు, భాగస్వాములు, ఇతర వాటాదారులకు నాయకత్వం విషయంలో స్పష్టత ఉండటం కూడా అంతే ముఖ్యం అని స్ప‌ష్టం చేశారు. నా పదవీకాలం ముగిసినప్పుడు తిరిగి నియామకానికి సిద్ధంగా లేనని నేను ఈ రోజు టాటా సన్స్ బోర్డుకు తెలియజేశాను. సరైన రీతిలో బాధ్యతల బదిలీ జరిగేలా చూసేందుకు, తదుపరి నాయకత్వంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని నేను బోర్డును కోరానన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!