Salman Butt : ర‌మీజ్ ర‌జాపై స‌ల్మాన్ భ‌ట్ ఫైర్

మితిమీరిన జోక్యంపై ఆగ్ర‌హం

Salman Butt  : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిఇఓ, చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జాపై సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు ఆ దేశ క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ స‌ల్మాన్ భ‌ట్. జ‌ట్టు ఎంపిక‌లోనే కాదు అన్నింటా ర‌మీజ్ ర‌జా ప్ర‌మేయం ఎక్కువ‌గా ఉందంటూ ఆరోపించాడు.

వీడియో కాల్ ద్వారా పిచ్ ను కూడా చూపించ‌మంటూ కోరాడ‌ని బాంబు పేల్చాడు. పిచ్ త‌యారీ ద‌గ్గ‌రి నుంచి జ‌ట్టులో ఎవ‌రు ఉండాల‌నే దానిపై కూడా ర‌మీజ్ ర‌జా అన‌వ‌స‌రంగా జోక్యం చేసుకున్నారంటూ బాంబు పేల్చాడు.

త‌న యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశాడు. ప్ర‌స్తుతం భ‌ట్ (Salman Butt)చేసిన కామెంట్స్ క్రికెట్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపాయి.

రమీజ్ ర‌జా ప్ర‌స్తుతం అవిశ్వాస తీర్మానంలో 2 ఓట్ల‌తో ఓడి పోయిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ , మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత స‌న్నిహితుడు.

ఇమ్రాన్ ఏరి కోరి ర‌మీజ్ ర‌జాను తీసుకు వ‌చ్చాడు. ప్ర‌స్తుతం ఆయ‌న దిగి పోయాడు. త్వ‌ర‌లో ర‌మీజ్ ర‌జా కూడా స్వ‌చ్చంధంగా త‌ప్పుకోనున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

పాక్ లో కొలువు తీరింది కొత్త ప్ర‌భుత్వం. ఈ త‌రుణంలో స‌ల్మాన్ భ‌ట్(Salman Butt) వ్యాఖ్య‌లు తీవ్ర దుమారానికి దారి తీశాయి. పేల‌వ‌మైన పిచ్ లు త‌యారు చేయ‌డంపై పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్లు పీసీబీ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇందుకు సంబంధించి భార‌త క్రికెట్ కు సంబంధించిన క్యూరేట‌ర్ల‌ను సంప్ర‌దించాల‌ని కూడా సూచించారు. ఫస్ట్ , సెకండ్ టెస్టులు డ్రాగా ముగియ‌గా మూడో టెస్టులో ఆసిస్ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

Also Read : రాజ‌స్థాన్ గుజ‌రాత్ నువ్వా నేనా

Leave A Reply

Your Email Id will not be published!