Amber Heard : జానీ డెప్ ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నా
మాజీ భార్య అంబర్ హియర్డ్ కామెంట్
Amber Heard : ఆ ఇద్దరూ దిగ్గజ నటులు. హాలీవుడ్ లో పేరు మోసిన వారు జానీ డెప్ , అంబర్ హియర్డ్. ఇద్దరూ కొన్నాళ్ల పాటు కలిసి ఉన్నారు. భార్యా భర్తలుగా జీవించారు.
కానీ ఉన్నట్టుండి అంబర్(Amber Heard) జానీ డెప్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని, మానసికంగా తట్టుకోలేక పోతున్నానని వాపోయింది. ఈ మేరకు కోర్టు మెట్లు ఎక్కింది.
జానీ డెప్ నుంచి రూ. 100 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలంటూ పరువు నష్టం దావా వేసింది. ఇందుకు సంబంధించి ఓ పత్రికలో ఓ స్టోరీ కూడా రాసింది. దీంతో వర్జీనియా కోర్టు ఇటీవల 11 వారాల పాటు విచారణ జరిపింది ఈ కేసు గురించి.
చివరకు మాజీ భార్య అంబర్ హియర్డ్(Amber Heard) కు కోలుకోలేని షాక్ తగిలింది. తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వచ్చింది. ఆమె ఆరోపించిన దాంట్లో ఏ ఒక్కటి నిజం లేదని తెలిపింది జ్యూరీ.
అంతే కాదు తనను ఇబ్బందులకు గురి చేసినందుకు గాను జానీ డెప్ కు $15 మిలియన్ డాలర్లు పరిహారం ఇవ్వాలంటూ తీర్పు చెప్పింది.
ఇదే సమయంలో తీర్పు వెలువడిన అనంతరం ఆమె ఓ ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడింది. జానీ డెప్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో పెద్ద నటుడంటూ కితాబు ఇచ్చింది.
తాజాగా ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ఇప్పటికీ జాన్ డెప్ ను తాను ప్రాణ ప్రదంగా ప్రేమిస్తున్నానని చెప్పింది అంబర్ హియర్డ్. 2015లో పెళ్లి చేసుకున్నారు.
రెండేళ్ల తర్వాత విడి పోయారు. మా ఇద్దరి మధ్య బంధం విడిపోకుండా ఉండేందుకు చేయాల్సిందంతా చేశానని చెప్పింది.
Also Read : కాశ్మీరీ పండిట్లపై సాయి పల్లవి కామెంట్స్