Priyanka Chopra Homeware : ప్రియాంక ‘హోమ్‌వేర్’ ప్రారంభం

మ‌నీష్ కె. గోయల్ తో క‌లిసి స్టార్ట్

Priyanka Chopra Homeware : ప్రియాంక చోప్రా మ‌రోసారి త‌న‌దైన ప్ర‌త్యేక‌త చాటుకున్నారు. ఆమె న‌టిగానే కాకుండా మంచి వ్యాపార‌వేత్త‌గా కూడా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునే పనిలో ప‌డ్డారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లింది.

అమెరికా లోని న్యూయార్క్ లో స్వంతంగా సోనా రెస్టారెంట్ ను స్టార్ట్ చేసింది. అక్క‌డంతా భార‌తీయ వంట‌కాలకు ప్ర‌సిద్ది. అతి త‌క్కువ కాలంలోనే ఆ రెస్టారెంట్ మోస్ట్ పాపుల‌ర్ గా నిలిచింది.

భారీ ఆదాయం స‌మ‌కూరుతోంది. ప్ర‌స్తుతం ఫుల్ జోష్ లో ఉన్న ప్రియాంక చోప్రా తాజాగా ఇదే న‌గ‌రంలో హోమ్ వేర్ క‌లెక్ష‌న్ ను ప్రారంభించింది.

అమెరికాలోని ఇళ్ల‌కు భార‌తీయ వార‌స‌త్వానికి సంబంధించిన వాటిని అందించాల‌నే ఉద్దేశంతో దీనిని స్టార్ట్ చేసిన‌ట్లు ప్రియాంక చోప్రా త‌న సోష‌ల్ మీడియా ఇన్ స్టా లో వెల్ల‌డించింది.

స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు మ‌నీష్ కె. గోయ‌ల్ తో క‌లిసి కొత్త‌గా ఏర్పాటు చేసిన హోమ్ వేర్(Priyanka Chopra Homeware) లైన్ సోనా హోమ్ ను ప్రారంభించింది. అంతే కాకుండా దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేసింది.

ఇదే స‌మ‌యంలో ప్రియాంక చోప్రా జోనాస్ బిజీగా మారారు. కొన్నేళ్లుగా త‌న న‌ట‌న‌తో అల‌రిస్తున్నారు. అంతే కాదు దాతృత్వ కార్య‌క్ర‌మాల‌తో ఆదుకుంటున్నారు.

ప‌లువురి హృద‌యాల‌ను గెలుచుకున్నారు త‌న సేవల‌తో ప్రియాంక చోప్రా. అదే స‌మ‌యంలో న‌టిగానే కాదు విజ‌య‌వంత‌మైన బిజినెస్ విమెన్ గా పేరొందారు.

భారతీయ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబించేందుకే తాను సోనా హోమ్ వేర్ ను స్టార్ట్ చేసిన‌ట్లు తెలిపింది ప్రియాంక చోప్రా(Priyanka Chopra Homeware).

Also Read : వైట్ సారీ లో వైట్ బ్యూటీ అనన్య నాగళ్ల అందాల విందు

Leave A Reply

Your Email Id will not be published!