హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) రోజు రోజుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఎండీ నాగిరెడ్డి బాధ్యతలు స్వకరించాక విద్యుత్ బస్సుల వినియోగం పెరిగింది. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకించారు ఆర్టీసీ కార్మికులు. వీటిని ప్రైవేట్ సంస్థలకు కాకుండా ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడిపించలని కోరారు. ఈ తరుణంలో ఇప్పటికే లాజిస్టిక్ ద్వారా భారీ ఎత్తున ఆర్టీసీ సంస్థకు ఆదాయం సమకూరుతోంది. మరో వైపు తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది. హైదరాబాద్‌లో ప్రయాణ ఇబ్బందులను తొలగించేందుకు ఆర్టీసీ ‘సింగిల్-టికెట్’ ఈ-ఆటోరిక్షాల ప్రణాళికను సిద్దం చేస్తోందని సమాచారం. ప్రయాణ ప్రారంభం, ముగింపు దశల అనుసంధానాన్ని మెరుగు పరిచేందుకకు ఆర్టసీ విద్యుత్ ఆటో రిక్షాలను ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
ఇంతకు ముందే సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆర్టీసీ అధికారులను గత మూడు నెలల కిందట ఆదేశించారు . దీంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంతర్గత ప్రాంతాలను అనుసంధానించే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను ప్రవేశ పెట్టాలని ప్రతిపాదించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సేవకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయడానికి అధికారులు ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు , అగ్రిగేటర్లతో చర్చలు జరుపుతున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ మొదట హైదరాబాద్‌లో ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇతర నగరాలకు విస్తరిస్తారు. ఈ కొత్త ప్రణాళిక ద్వారా ‘పాయింట్-టు-పాయింట్’ టికెటింగ్ విధానం అందుబాటులోకి వస్తుందని, దీనివల్ల ప్రయాణికులు ఒకే టికెట్‌తో తమ ప్రయాణంలోని వివిధ దశలను పూర్తి చేయగలరని తెలిపారు. ఈ విధానంలో, ప్రయాణికుడు ఒక అంతర్గత ప్రాంతం నుండి బస్ స్టాండ్‌కు ఆటోరిక్షాలో వెళ్లి, అక్కడి నుండి బస్సులో గమ్యస్థానానికి దగ్గరి పాయింట్ వరకు ప్రయాణించి, ఆపై చివరి ప్రదేశానికి చేరుకోవడానికి మరో ఆటోరిక్షాను ఉపయోగించుకునే వీలు కలుగుతుంది.
