దైవ నామ స్మ‌ర‌ణ‌తో నిజ‌మైన ఆనందం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఆధ్యాత్మిక వ‌క్త

ముంబై | ఆధ్యాత్మిక వక్త జయ కిషోరి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దైవ నామ స్మ‌ర‌ణ‌తోనే నిజ‌మైన ఆనందం ల‌భిస్తుంద‌ని అన్నారు. ఆమె ముంబైలో భారీ ఎత్తున ఆధ్యాత్మ‌క క‌చేరి నిర్వ‌హించ‌నున్నారు జూన్ 28న . ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు జయ కిశోరి. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లను ఆహ్వానించడానికి తాను ఇక్క‌డికి వచ్చానని అన్నారు. ఆ రోజు ముంబైలో జ‌రిగే ఈ ‘దైవిక సంగీత కచేరీ ప్ర‌తి ఒక్క‌రిలో ఆనందాన్ని, సంతోషాన్ని క‌లిగించేలా చేస్తుంద‌ని చెప్పారు జ‌యా కిషోరి . రాష్ట్ర వ్యాప్తంగా సీఎం, డిప్యూటీ సీఎంలు ఆధ్యాత్మికతను ప్రోత్సహించడానికి ఎంతో కృషి చేస్తున్నారని ప్ర‌శంస‌లు కురిపించారు. పైగా ఇది అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమం అని వారి ఉనికి లేకుండా ఇది అసంపూర్ణంగా అనిపిస్తుంద‌ని పేర్కొన్నారు ఆధ్యాత్మిక వేత్త‌, మోటివేష‌న‌ల్ స్పీక‌ర్.

పేరుకు తగ్గట్టుగానే ఇది ఒక దైవిక సంగీత కచేరీ మనం గతంలో భజనలు వినే ఉంటాం, కానీ ఇప్పుడు వాటిని ఒక కచేరీ రూపంలో అందిస్తున్నాం అని చెప్పారు జ‌యా కిషోరి. ఎలాంటి మత్తు పదార్థాల అవసరం లేకుండా, కేవలం దైవ నామస్మరణ ద్వారానే ఆనందం, ఉల్లాసం, ఆధ్యాత్మిక పరమానందాన్ని పొందవచ్చని యువత గ్రహించాలని తాము కోరుకుంటున్నట్లు స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి , యువతలో మరింత భక్తి భావాన్ని పెంపొందించడానికి తాము శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!