హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెరలో అత్యంత జనాదరణ పొందిన నటుడిగా గుర్తింపు పొందారు అక్కినేని నాగార్జున. ఈ సందర్భంగా ఔత్సాహికులకు మేలు జరిగేలా కీలక ప్రకటన చేశారు. కొత్త ఆలోచనలతో వచ్చే వారికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇది ఒక గేమ్ ఛేంజర్ కావచ్చని సినిమా రంగానికి చెందిన ప్రముఖులు. ఇదిలా ఉండగా తక్కువ బడ్జెట్ చిత్రాలకు మద్దతు ఇవ్వడంలో పేరున్న నిర్మాత రాజ్ కందుకూరి, నాగార్జున తీసుకున్న ఈ కొత్త నిర్ణయం పరిమిత బడ్జెట్‌తో పనిచేసే చిత్రనిర్మాతలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. అనుభవజ్ఞుడైన స్టార్ నాగార్జున తాజా కంటెంట్‌కు మద్దతు ఇవ్వాలని , కొత్త, వినూత్న ఆలోచనలు ఉన్న చిత్రనిర్మాతలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు. కేవలం తన స్టూడియో సౌకర్యాలను అద్దెకు ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించడం కంటే, చలనచిత్ర పరిశ్రమలో తిరిగి పెట్టుబడి పెట్టడానికే తాను ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నానని స్పష్టం చేశారు ఈ నటుడు.
మంచి కాన్సెప్ట్‌లతో అన్నపూర్ణ స్టూడియోస్ బృందాన్ని సంప్రదించాలని యువ చిత్ర నిర్మాతలను ఆయన కోరారు. మా నాన్న సినిమాలు నిర్మించారు, నేను కూడా నా వంతు కృషి చేశాను. ఇప్పుడు కొత్త ఆలోచనలతో వచ్చే ప్రతిభావంతులకు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. తన ఉద్దేశాన్ని నిజం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సమర్పణలో రాబోతున్న తెలుగు ఫ్యామిలీ డ్రామా పల్లబరుసు అధికారిక ట్రైలర్‌ను నాగార్జున ఇటీవల విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణాని నిర్మాతలుగా వ్యవహరించగా ఉదయ్ చౌహాన్ రచన , దర్శకత్వం వహించారు. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, గోమతి, ప్రజ్వల్ యడ్మ , సుజాత కీలక పాత్రలు పోషించారు. ఈ ట్రైలర్ ఒక విభిన్నమైన , ఆసక్తికరమైన అంశంతో మొదలైంది.
