Brij Bhushan Singh : బ్రిజ్ భూష‌ణ్ సింగ్ పై సిట్ ఏర్పాటు

సుప్రీంకోర్టుకు తెలిపిన ఢిల్లీ పోలీసులు

లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (డ‌బ్ల్యుఎఫ్ఐ) చీఫ్ , భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ కు కోలుకోలేని షాక్ త‌గిలిగింది. గ‌త ఏప్రిల్ నెల 23 నుంచి ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద మ‌హిళా రెజ్ల‌ర్లు నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు. రెజ్ల‌ర్ల ఆందోళ‌న‌కు సంయుక్త కిసాన్ మోర్చా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. భారీ ఎత్తున రైతులు సంఘీభావం తెలిపారు.

ఈ త‌రుణంలో లైంగిక వేధింపుల దావాను విచారించేందుకు ప్ర‌త్యేక బృందం (సిట్ ) ను ఏర్పాటు చేసిన‌ట్లు ఢిల్లీ పోలీసులు వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది. అద‌న‌పు చీఫ్ మెట్రో పాలిట‌న్ మేజిస్ట్రేట్ హ‌ర్జీత్ సింగ్ జ‌స్పాల్ ముందు నివేదిక‌ను స‌మ‌ర్పించారు.

త‌మ‌పై వేధింపుల‌కు గురి చేస్తూ వ‌స్తున్న బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ ను అరెస్ట్ చేయాల‌ని, ఆయ‌న‌ను డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు మ‌హిళా రెజ్ల‌ర్లు. ఇదిలా ఉండ‌గా స్టేట‌స్ రిపోర్టును దాఖ‌లు చేయాల‌ని పోలీసుల‌ను ఆదేశిస్తూ గ‌తంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాము ఫిర్యాదు చేసినా ఢిల్లీ ఖాకీలు ప‌ట్టించు కోలేదంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ మేర‌కు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సీజేఐ చంద్ర‌చూడ్ సీరియ‌స్ అయ్యారు. ఢిల్లీ ఖాకీల‌కు నోటీసులు జారీ చేయ‌డంతో దెబ్బ‌కు దిగి వ‌చ్చారు.

Leave A Reply

Your Email Id will not be published!