Sushil Kumar Shinde : సీఎం సిద్ద‌రామ‌య్య‌తో షిండే భేటీ

అభినంద‌న‌ల‌తో ముంచెత్తిన మాజీ సీఎం

Sushil Kumar Shinde : మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు సుశీల్ కుమార్ షిండే బెంగ‌ళూరుకు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా తాజాగా సీఎంగా కొలువు తీరిన సిద్ద‌రామ‌య్య‌తో భేటీ అయ్యారు. ముఖ్య‌మంత్రితో చాలా సేపు సంభాషించారు. సిద్ద‌రామ‌య్య‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. మీ సార‌థ్యంలో క‌ర్ణాట‌క రాష్ట్రం మ‌రింత‌గా అభివృద్ది చెందాల‌ని ఆకాంక్షించారు.

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీలో సిద్ద‌రామ‌య్య‌, సుశీల్ కుమార్ షిండే(Sushil Kumar Shinde) అత్యంత సీనియ‌ర్ నాయ‌కులుగా పేరు పొందారు. దేశంలో, రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిమాణాల గురించి చ‌ర్చించారు. ఇదే స‌మ‌యంలో ప‌లు సూచ‌న‌లు , స‌ల‌హాలు అంద‌జేశారు సుశీల్ కుమార్ షిండే.

సిద్ద‌రామ‌య్య సీఎంగా గ‌తంలో క‌ర్ణాట‌క‌లో ఉన్నారు. తాజాగా రాష్ట్రంలో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని రీతిలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజ‌యాన్ని సాధించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల‌కు గాను 135 స్థానాల‌ను కాంగ్రెస్ కైవ‌సం చేసుకుంది. బీజేపీ 65 సీట్ల‌కే ప‌రిమితం అయితే చ‌క్రం తిప్పాల‌ని ఆశించిన జేడీఎస్ 19 స్థానాల‌తో స‌రి పెట్టుకుంది. నలుగురు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు గెలుపొందారు. వారు కూడా సీఎం సిద్ద‌రామ‌య్య‌కు మ‌ద్ద‌తు ప‌లికారు.

క‌ర్ణాట‌క కాంగ్రెస పార్టీ చీఫ్ డీకే శివ‌కుమార్ సార‌థ్యంలో క‌ర్ణాట‌క రాష్ట్రంలో అద్భుతం చేసింది. ఊహించ‌ని రీతిలో కాషాయ పార్టీకి షాక్ ఇచ్చింది. సీఎం రేసులో ఉన్న‌ప్ప‌టికీ చివ‌ర‌కు హైక‌మాండ్ జోక్యంతో డిప్యూటీ సీఎంగా కొలువు తీరారు.

Also Read : AP CM YS Jagan : 99 శాతం ఇచ్చిన హామీలు అమ‌లు చేశా

 

Leave A Reply

Your Email Id will not be published!