CM KCR Gift : బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన రూటే సపరేట్. ఇతర నేతల కంటే భిన్నంగా ఉంటారు. అంతే కాదు ఆయన అపారమైన అనుభవం కలిగి ఉండడంతో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతున్నారు. ఆతిథ్యం ఇవ్వడంలో తనకు తనే సాటి అనిపించుకున్నారు కేసీఆర్. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించడం, అమాయకంగా ఉంటూనే అసాధ్యమైన రీతిలో విరుచుకు పడడం కేసీఆర్ కు మాత్రమే చెల్లింది.
రాదనుకున్న తెలంగాణను వచ్చేలా చేసిన ఘనత కూడా ఆయనదే. ఇదే సమయంలో తెలంగాణలో తన పాలన 9 ఏళ్లు పూర్తయింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేశారు కేసీఆర్(KCR). ఆపై దేశ వ్యాప్తంగా బరిలో నిలబడేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆపై ఎలాగైనా సరే చక్రం తిప్పాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా మరాఠాపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించారు.
పలువురు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, శ్రేణులు , కార్యకర్తలు, అనుచరులు భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు ఉత్సుకుత చూపిస్తున్నారు. ఇదే సమయంలో మరాఠాలో రెండు రోజుల పాటు పర్యటించారు కేసీఆర్. ఆయన ఏకంగా 600 వాహనాలతో బయలు దేరారు. ఈ సందర్బంగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఓ సామాన్యుడు సీఎం కేసీఆర్ కు దేవుడి బొమ్మను అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read : Justice Madan B Lokur : ఢిల్లీ ఆర్డినెన్స్ అప్రజాస్వామికం
