Pawan Kalyan : ప‌వ‌ర్ లోకి వ‌స్తే సింగిల్ విండో ప‌ద్ద‌తి

స్ప‌ష్టం చేసిన జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan : జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేప‌ట్టిన వారాహి విజ‌య యాత్ర ప్ర‌స్తుతం ఏపీలో కొన‌సాగుతోంది. ఇందులో భాగంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. జ‌న‌సేన అధికారం లోకి వ‌స్తే పారిశ్రామిక‌, వ్యాపార అనుమ‌తుల‌కు సింగిల్ విండో సిస్ట‌మ్ ను తీసుకు వ‌స్తామ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థాయికి తీసుకు వెళ‌తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించి ప్ర‌జ‌లు జ‌నసేన పార్టీని రాబోయే ఎన్నిక‌ల్లో గెలిపించాల‌ని, భారీ మెజారిటీ సాధిస్తే ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని చెప్పారు.

ఇక అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రాన్ని ప్ర‌గ‌తి ప‌థంలో ప‌రుగులు పెట్టేలా చేస్తాన‌ని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చిన వాళ్ల‌ను వ‌దిలి పెట్టే ప్ర‌సక్తి లేద‌ని హెచ్చ‌రించారు. ఏ పార్టీకి లేనంత మంది అభిమానులు త‌మ పార్టీకి ఉన్నార‌ని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan). మీరంతా కార్య రంగంలోకి దూకాల‌ని, ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. పార్టీని మ‌రింత బలోపేతం చేసేందుకు కార్యోన్ముఖులు కావాల‌ని స్ప‌ష్టం చేశారు జ‌న‌సేన పార్టీ చీఫ్‌.

ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ ను ఏకి పారేశారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు ప‌వ‌న్ కళ్యాణ్. అరాచ‌కాల‌కు అడ్డు అదుపు లేకుండా పోయింద‌ని మండిప‌డ్డారు జ‌న‌సేనాని.

Also Read : CM KCR Gift : సామాన్యుడి కానుక కేసీఆర్ ఫిదా

Leave A Reply

Your Email Id will not be published!