Jupally Krishna Rao : మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావుకు కోలుకోలేని షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టింది. జూలై 20న ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఈ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసేందుకు శ్రీకారం చుట్టారు జూపల్లి కృష్ణారావు.
ఆయన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకోవాలని భావించారు. ఇప్పటికే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం వేదికగా జరిగిన జన గర్జన సభలో ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే సభలో జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) కూడా జాయిన్ అవుతారని అంతా భావించారు. కానీ సీన్ మారింది. పార్టీ పరంగా తన సత్తా చాటాలని భావించారు జూపల్లి. ఇందులో భాగంగా కొల్లాపూర్ లో సభకు ప్లాన్ చేశారు.
ఈ మేరకు పార్టీ పరంగా కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇదే సమయంలో మాజీ మంత్రి జూపల్లితో పాటు ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేశారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించారు. జూపల్లి, కూచుకుళ్ల ప్రియాంక సమక్షంలో చేరాలని అనుకుంటున్న తరుణంలో ఉన్నట్టుండి సభ వాయిదా పడడంతో బిగ్ షాక్ తగిలింది.
Also Read : MLA Pilot Rohit Reddy : పట్నం పనై పోయింది – రోహిత్ రెడ్డి
