CEC Bill : మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుంది. తీవ్ర గందరగోళం మధ్య రాజ్యసభలో సీఈసీ బిల్లు(ECE Bill) ఆమోదం పొందేలా చేసింది. కానీ ప్రధాన ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన ఎంపిక కమిటీలో భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ని మినహాయించాలని ప్రతిపాదించింది.
CEC Bill Will Be Approved
మోదీ సర్కార్ కు కావాల్సింది ఇదే. ఎందుకంటే తాము చెప్పినట్లు నడిచే యంత్రాంగం కావాలి. జీ హుజూర్ అనే ఎన్నికల కమిషనర్ అయి ఉంటే బావుంటుందని అనుకుంది. అలాగే ప్లాన్ చేసింది. ఆ మేరకు బిల్లు ఆమోదం పొందేలా చేసింది.
ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల అధికారి లను నియమించే సెలెక్షన్ ప్యాన్ భాగం నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించాలని కోరుతూ ప్రభుత్వం ప్రధాన ఎన్నికల కమిషనర్ , ఎన్నికల కమిషనర్ల బిల్లులను ప్రవేశ పెట్టింది. ఎంపిక ప్యానెల్ లో భాగంగా లోక్ సభలో ప్రధాన మంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, కేంద్ర మంత్రివర్గంలో ఒక మంత్రి మాత్రమే ఉండాలని బిల్లు ప్రతిపాదించారు.
దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు విపక్ష సభ్యులు . ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. నిజాయితీ కలిగిన సీజేఐని మినహాయించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
Also Read : Vijay Sai Reddy : సినీ నటులపై విజయ సాయి సెటైర్
