Pandit Nehru : దేశపు మార్గదర్శిని మార్చలేరు
స్పష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ
Pandit Nehru : ఈ దేశం ఎందరో బలిదానాలు, త్యాగాల ఫలితం. దేశ భవిష్యత్తుకు బాటలు వేసిన అరుదైన నాయకుడు దివంగత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ. ఆయన పాలించిన కాలం స్వర్ణ యుగం. ఈ దేశం కోసం తన మేధస్సును ఉపయోగించారు. ఎన్నో కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పంచవర్ష ప్రణాళిక ఆయన పుణ్యమే. మెరుగైన సమాజం కోసం , అద్భుతమైన భారత దేశం కోసం కలలుకన్న గొప్ప నాయకుడు పండిట్ నెహ్రూ.
Pandit Nehru Great leader
ఇదిలా ఉండగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ వస్తోంది. ప్రత్యేకించి ప్రధానమంత్రి కావాలని కాంగ్రెస్ కు సంబంధించిన చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేయాలని అనుకుంటున్నారని పేర్కొంది. చరిత్ర సృష్టించబడింది..కానీ మార్చేందుకు వీలు లేదని తెలుసు కోవాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
పేరు మార్చినంత మాత్రాన నెహ్రూ(Pandit Nehru) వారసత్వం, చరిత్ర, స్పూర్తి చెరిగి పోదని ప్రధాని గుర్తించాలని సూచించింది. పండిట్ జీ కృషి వల్లనే ఇవాళ కొలువు తీరి విశిష్ట సేవలు అందిస్తున్న ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ లు, ఇస్రో, బార్క్ తో పాటు పలు కంపెనీలు ఉన్నాయని పేర్కొంది. ఇలాంటి చవకబారు చేష్టలకు పుల్ స్టాప్ పెట్టాలని సూచించింది. పేర్లు మార్చినా వారు చేసిన పనుల్ని మార్చలేరంటూ ఎద్దేవా చేసింది.
Also Read : KC Venu Gopal : పేరు మార్చడం కక్ష సాధించడమే
