DK Shiva Kumar : బీఆర్ఎస్ స‌ర్కార్ అవినీతికి కేరాఫ్

క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్

DK Shiva Kumar  : తాండూరు – క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన రెండో విజ‌యభేరి యాత్ర స‌మావేశంలో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ద‌మ్ముంటే త‌న స‌వాల్ ను స్వీక‌రించాల‌ని సీఎం కేసీఆర్, త‌న‌యుడు మంత్రి కేటీఆర్ ల‌కు స‌వాల్ విసిరారు.

DK Shiva Kumar Challenge to KCR and KTR

బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి నిల‌యంగా మారింద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో బాధ్య‌తా రాహిత్యానికి ప‌రాకాష్ట‌గా పాల‌న మారింద‌ని మండిప‌డ్డారు డీకే శివ‌కుమార్(DK Shiva Kumar ). తండ్రీ కొడుకుల కోసం ఒక బ‌స్సు పంపిస్తాన‌ని, మీ స‌హ‌చ‌ర మంత్రుల‌తో క‌ర్ణాట‌క‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు.

కావాల‌ని ప్ర‌జ‌ల్లో అయోమ‌యం సృష్టించేందుకు నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని జ‌నం ఆద‌రిస్తున్నార‌ని, దానిని త‌ట్టుకోలేక పోతోందంటూ మండిప‌డ్డారు.

ఆరు నూరైనా స‌రే ఈసారి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. దొర‌ల పాల‌న‌ను చూసి తెలంగాణలోని నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకం విసిగి పోయార‌ని ఆరోపించారు.

Also Read : Rahul Gandhi : బీసీ కుల గ‌ణ‌న‌పై మౌన‌మేల‌

Leave A Reply

Your Email Id will not be published!