EC Notice : న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం(EC) సంచలన కామెంట్స్ చేసింది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. మొదట బీఆర్ఎస్ సీరియస్ గా స్పందించింది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ ఆరోపించింది. దీనిపై విచారణ చేపట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. చివరకు ఎంక్వైరీ చేశాక తప్పని తేలింది. కేవలం వ్యక్తిగత కక్షతో దాడి చేయడం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదని పోలీసులు పేర్కొన్నారు.
EC Notice to KCR
ఇదిలా ఉండగా కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగిన ఘటనపై స్పందించారు కేసీఆర్. కాంగ్రెస్ పై నోరు పారేసుకున్నారు. సీఎం ప్రసంగంపై కాంగ్రెస్ నాయకుడు బల్మూరి వెంకట్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది.
ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేదిగా, ఘర్షణ వాతావరణం నెలకొనేలా ఉందంటూ స్పష్టం చేసింది. ఇక నుంచి రెచ్చగొట్టేలా ప్రసంగం చేయొద్దంటూ హెచ్చరించింది. ఇది కచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇంకోసారి ఇలాగే చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసు పంపింది. దీనిని సీఎంకు పంపించాలని ఆదేశించింది.
Also Read : Eatala Rajender : దొర గడీల పాలనకు మూడింది
