గుజరాత్ : కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ను టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగే కీలక మ్యాచ్ లో ఆడిస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఇంకా మౌనం వహించడం పట్ల హెడ్ కోచ్ గౌతం గంభీర్ పై మండిపడుతున్నారు శాంసన్ అభిమానులు. సూపర్ 8 మ్యాచ్లలో భాగంగా ఈ కీలక మ్యాచ్ భారత జట్టుకు అత్యంత కీలకం. ప్రస్తుతం టీం ఇండియా తీవ్ర సమస్యను ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి ఓపెనర్లుగా ఇద్దరిని ప్రయోగించింది మేనేజ్మెంట్. ఓపెనర్లు గా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఆశించిన మేర రాణించలేదు.
మొత్తం ఎనిమిది మ్యాచ్ లు ఆడితే 5 మ్యాచ్ లలో శర్మ డకౌట్ అయ్యాడు. మరో వైపు నమీబియాతో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు శాంసన్. కేవలం ఎనిమిది బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇందులో మూడు సిక్సులతో పాటు ఒక ఫోర్ కొట్టాడు. 22 పరుగులు చేశాడు. 272 స్ట్రైక్ రేట్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగిన మ్యాచ్ ల నుంచి ఆడకుండా తప్పించారు. కేవలం తనను బెంచ్ కే పరిమితం చేశాడు. తాజాగా క్రికెట్ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది సంజు శాంసన్. మరో వైపు తిలక్ వర్మ ను తీసేసి శాంసన్ కు ఛాన్స్ ఇస్తున్నట్లు టాక్. ఇదిలా ఉండగా అహ్మదాబాద్ లో సంజు శాంసన్ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. దీన్ని బట్టి తనను తుది జట్టుకు ఎంపిక చేస్తారని సమాచారం.
