ముంబై : అందరి కళ్లు ఇప్పుడు రేపు జింబాబ్వేతో జరిగే కీలక మ్యాచ్ పైనే ఉన్నాయి. దీనికి కారణం భారత జట్టు ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది. ఈసారి కూడా టైటిల్ ఫెవరేట్ గా ఉన్నప్పటికీ టీమిండియా ఆశించిన మేర రాణించడం లేదు. టోర్నీలో భాగంగా వరుసగా నాలుగు మ్యాచ్ లలో గెలుపొంది సత్తా చాటినా చివరకు సూపర్ -88లో భాగంగా జరిగిన కీలక పోరులో బలమైన దక్షిణాఫ్రికా జట్టుచేతిలో భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇక ఇదే విభాగంగా ఇండియా టీం రెండు జట్లతో తలపడనుంది. ఇందులో భారీ తేడాతో గెలుపొందాల్సి ఉంది. మరో వైపు విండీస్ టీం కూడా సూపర్ షో చేస్తుండడంతో టీమిండియాకు అగ్ని పరీక్షగా మారింది.
ఐసీసీ బిగ్ టోర్నీలో ఇప్పటి వరకు ఆశలు రేపిన ఆటగాళ్లు ఎవరూ ఆశించిన మేర రాణించలేక పోయారు. అందులో ప్రధానంగా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే బ్యాటర్లుగా పేరొందిన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ నిరాశ పరిచారు. శాంసన్ నాలుగు మ్యాచ్ లలో వరుసగా డకౌట్ కాగా కీలకమైన సౌతాఫ్రికా తో శర్మ కేవలం 15 పరుగులు సాధించాడు. బోణీ కొట్టాడు. అయినా ఇది తన వరకు చూస్తే మంచి స్కోర్ కానే కాదు. ఇక సంజు శాంసన్ వరకు చూస్తే ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్ లో 8 బంతులు ఎదుర్కొని 3 సిక్సులు ఒక ఫోర్ తో 22 రన్స్ చేశాడు. తాజాగా జింబాబ్వేతో రేపు జరిగే మ్యాచ్ లో శాంసన్ ను వికెట్ కీపర్, బ్యాటర్ గా వాడుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
