వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ నాకు అత్యంత కీల‌కం

కీల‌క కామెంట్స్ చేసిన క్రికెట‌ర్ సంజు శాంస‌న్

అహ్మ‌దాబాద్ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ కు వేదిక కానుంది అహ్మ‌దాబాద్. ఇప్ప‌టికే రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడు పోయాయి. 143 కోట్ల భార‌తీయులంతా ఈ మ్యాచ్ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే హొట‌ళ్లు అన్నీ బుక్ అయి పోయాయి. ల‌క్షా 30 వేల టికెట్లు ఇప్ప‌టికే అమ్ముడు పోయిన‌ట్లు అహ్మ‌దాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ ప్ర‌క‌టించింది. భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రితో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన ప్ర‌ముఖులు, నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులు, వ్యాపార‌, వాణిజ్య‌, క్రీడా, సాంస్కృతిక‌, సినీ రంగానికి చెందిన టాప్ సెలిబ్రిటీలు అహ్మ‌దాబాద్ బాట ప‌ట్టారు.

టాస్ అన్న‌ది కీల‌కం కానుంది భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల‌కు. న్యూజిలాండ్ సెమీ ఫైన‌ల్ లో బ‌ల‌మైన , హాట్ ఫెవ‌రేట్ ఉన్న సౌతాఫ్రికా జ‌ట్టును 9 వికెట్ల భారీ తేడాతో ఓడించింది. ఫైన‌ల్ కు చేరుకుంది. ఇక ఇండియా జ‌ట్టు వెస్టిండీస్ పై క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో, ఇంగ్లండ్ ను సెమీస్ లో ఓడించింది. నేరుగా ఫైన‌ల్ కు వెళ్లింది. ప్ర‌ధానంగా సంజు శాంస‌న్ గ‌నుక ఆడ‌క పోయి ఉండి ఉంటే ఇవాళ ఇండియా ఫైన‌ల్ కు వెళ్లేది కాదు. దీంతో అంద‌రి క‌ళ్లు త‌న‌పైనే ఉన్నాయి. తాడో పేడో తేల్చుకోవాల్సిన ఫైన‌ల్ మ్యాచ్ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు సంజు శాంస‌న్. ఈ మ్యాచ్ త‌న‌కు అత్యంత కీల‌క‌మ‌ని, మీ అంద‌రి ఆశీస్సులు కావాల‌ని కోరాడు. త‌ను చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి.

Leave A Reply

Your Email Id will not be published!