మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును అడ్డుకోవ‌డం దారుణం

ఏపీ సీఎం నారా చంద్రబాబు ఆయుడు ఆగ్ర‌హం

తూర్పు గోదావరి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు విప‌క్షాల‌పై. శ‌నివారం తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌రిగిన నిర‌స‌న ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎం. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవటం ద్వారా జాతికి ద్రోహం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు మహిళలకు అన్యాయం చేశాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నిన్నటి రోజు ఓ బ్లాక్ డే అని పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని, సుదీర్ఘ కల సాకారం అవుతుందని అందరం భావించాం అన్నారు చంద్రబాబు నాయుడు. పార్లమెంట్, అసెంబ్లీలోనూ 33 శాతం మంది మహిళల్ని ప్రజా ప్రతినిధులుగా చూస్తామని అనుకున్నాన‌ని చెప్పారు. మహిళల్ని గౌరవించటం భారత సంస్కృతిలో భాగం అని, ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలుంటారని మన నానుడి అని గుర్తు చేశారు.

అయితే నిన్న పార్లమెంటులో దానికి భిన్నంగా జరిగిందని ఆరోపించారు. అందుకు నిరసనగా నిడుదవోలులో ఎన్డీఏ పక్షాలు నిరసన ర్యాలీ చేపట్టడం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. మహిళలంతా బయటకు వచ్చి నిరసన తెలిజేయాలని పిలుపు ఇచ్చారు. దక్షిణాదికి, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాని, హోంమంత్రి హామీ ఇచ్చార‌న్నారు. 50 శాతం మేర సీట్లు పెరుగుతాయని స్పష్టంగా చెప్పారన్నారు. ఏపీలో కూడా 50 శాతం మేర సీట్లు పెరుగేవి అని తెలిపారు. కానీ ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ అజెండా కోసం ఈ దుర్మార్గం చేశాయన్నారు. దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాం అన్నారు. దీనిని అడ్డుకోవటం క్షమించరాని నేరం అని పేర్కొన్నారు సీఎం.

Leave A Reply

Your Email Id will not be published!