మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి క‌న్నుమూత

క‌న్నీటి ప‌ర్యంత‌మైన కేసీఆర్, కేటీఆర్, హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అర్ధరాత్రి ఒంటిగంట (12.51) సమయంలో సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయ‌న‌కు తొలుత గుండెపోటు వ‌చ్చింది. ఆ వెంట‌నే త‌న‌ను హుటా హుటిన త‌న స్వంత ప్రాంతం నుంచి సికింద్రాబ‌బాద్ కు త‌ర‌లించారు. . రక్త సరఫరా నిలిచి పోవడంతో రెండు గంటల పాటు బ్రెయిన్ రక్తం సరఫరా లేక పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి నెల‌కొంది. చివ‌రి దాకా వైద్యులు ఆయన బ్రెయిన్ రికవరీ కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరికి ఆయన తుదిశ్వాస విడిచిన‌ట్లు అర్ధ‌రాత్రి అధికారికంగా య‌శోద ఆస్ప‌త్రి యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది.

కింది స్థాయి నుంచి వచ్చిన పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి ఎమ్మెల్యే వ‌ర‌కు ఎన్నిక‌య్యారు. ఆయ‌న ఆగ‌స్టు 6, 1974లో పుట్టారు. వ‌రంగ‌ల్ లో ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దువుకున్నారు. వృత్తి ప‌రంగా వ్య‌వ‌సాయం చేశారు. తెలంగాణ ఉద్యమ ప్రారంభ దశ నుంచే అప్పటి బీఆర్ఎస్ లో చురుకైన పాత్ర పోషించారు. నల్లబెల్లి ప్రాంతం నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.జిల్లా స్థాయి పార్టీ అధ్యక్షుడిగా, తరువాత పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు. 2014, 2018, 2023లో నర్సంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సేవలందించారు. త‌న హ‌యాంలో గ్రామీణ రహదారులు చేప‌ట్టారు. రైతుల‌కు సాగు నీరు అందించేలా చేశారు. సంక్షేమ పథకాల అమలు చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు.

Leave A Reply

Your Email Id will not be published!