న్యూఢిల్లీ : అమెరికా పర్యటనలో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ మోహన్ భగవత్ తాజాగా చేసిన కామెంట్స్ పై సీపీఐ స్పందించింది. హిందూ-ముస్లిం ఐక్యతపై భగవత్ వ్యాఖ్యలపై స్పందించారు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా . ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వారు లౌకికవాదాన్ని ఒక సిద్ధాంతంగా లేదా జీవన విధానంగా అంగీకరిస్తారా? మనుస్మృతికి బదులుగా భారత రాజ్యాంగాన్ని అంగీకరించే స్థితిలో వారు ఉన్నారా? ఇవన్నీ చాలా కీలకమైన ప్రశ్నలు. కాబట్టి, ప్రశ్నలు సూటిగా ఉన్నప్పుడు, సమాధానం కూడా సూటిగా ఉండాలి అని ఆయన అన్నారు. అమెరికాలో హిందూ-ముస్లిం ఐక్యతపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. భగవత్ నిజాయితీపరుడు, సత్యసంధుడైతే అదే ప్రకటనను భారతదేశంలోనూ చేయాలని ఆయన అన్నారు. న్యూయార్క్‌లో జరిగిన ‘వన్ వరల్డ్ వన్ హ్యుమానిటీ’ కార్యక్రమంలో భగవత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాం రేపాయి.
విదేశాలలో అటువంటి ప్రకటన చేయడం వేరని, భారత గడ్డపై చేయడం వేరని రాజా పేర్కొన్నారు. అని భగవత్ భారతదేశంలో ముస్లింలు ఉండకూడదని భావించే వ్యక్తి హిందువుగా కొనసాగలేరని అన్నారు. అన్ని మార్గాలు ఒకే లక్ష్యానికి దారి తీస్తాయని, ప్రతి మనిషికీ గౌరవం ఉంటుందని హిందూ మతం బోధిస్తుందని ఆయన చెప్పారు. భారతదేశంలో ముస్లింలు ఉండకూడదని ఏ హిందువైనా భావిస్తే, అతను హిందువుగా మిగలడు. మిమ్మల్ని మీరు హిందువుగా పిలుచు కోవాలంటే, అన్ని మార్గాలు ఒకే లక్ష్యానికి దారితీస్తాయని , ప్రతి మనిషికీ గౌరవం ఉంటుందని మీరు నమ్మాలి. మనుషుల మధ్య ఎలాంటి తేడా లేదు అని ఆయన అన్నారు. మరోవైపు, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతంపై వస్తున్న ప్రశ్నల నుండి దృష్టిని మళ్లించేందుకే భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారని సీపీఐ ఎంపీ పి. సంతోష్ ఆరోపించారు. ఇవన్నీ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అనుసరిస్తున్న ఎత్తుగడలే. అసలు ఆర్‌ఎస్‌ఎస్ నిజమైన ఉద్దేశ్యం ఏమిటి? 1925లోనే ఈ సంస్థను ఎందుకు ప్రారంభించారు? ఇదే అసలు ప్రశ్న అని సంతోష్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని ప్రశ్నిస్తూ, ఆ సంస్థ లౌకికవాదాన్ని, భారత రాజ్యాంగాన్ని అంగీకరిస్తుందా అని ఆయన నిలదీశారు.
