న్యూఢిల్లీ : భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలనంగా మారాడు. తన పదవీ కాలం త్వరలో ముగియనుంది. తన మార్గదర్శకత్వంలో భారత జట్టు ఈ ఏడాది జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. విశ్వ విజేతగా నిలిచింది. ఇక రాబోయే కాలంలో ఐసీసీ ఆధ్వర్యంలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. దీంతో పాటు ఒలింపిక్స్ లో కూడా క్రికెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఇందులో కూడా సత్తా చాటాలని, మెడల్ సాధించాలని భావిస్తున్నాడు గంభీర్. ఇక ప్రస్తుతానికి టి20 జట్టు బాగానే ఉన్నా ఇంకా లోపాలు ఉన్నాయని , కొందరు ఆటగాళ్లను మార్చే ఛాన్స్ ఉందని టాక్. ఈ తరుణంలో ప్రస్తుతం అందరి కళ్లు వన్డే జట్టుపై ఉంది. దీనికి కారణం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఆట తీరును నిశితంగా గమనించనున్నాడు హెడ్ కోచ్.
ఇందులో భాగంగా చాలా మంది ఆటగాళ్లకు ఉద్వాసన పలికే ఛాన్స్ ఉందని సమాచారం. వన్డే జట్టు కోసం ఇప్పటికే 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. రాబోయే ఐపీఎల్‌లో వారి ప్రదర్శనను సెలెక్టర్లు, గౌతమ్ గంభీర్ నిశితంగా పరిశీలించనున్నారు. రోహిత్ శర్మ స్థానంపై ప్రశ్నార్థకంగా మారింది. ఐపీఎల్‌లో రాణించాలని, లేకపోతే ఆ స్థానాన్ని చేపట్టడానికి యశస్వి జైస్వాల్ సిద్ధంగా ఉన్నారని గంభీర్ స్పష్టం చేసినట్లు సమాచారం. 4వ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు ఒక పెద్ద అవకాశం లభించవచ్చు.షార్ట్ బాల్‌ను ఎదుర్కోవడంలో శ్రేయస్ అయ్యర్ బలహీనతపై జట్టు యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ఇక కోహ్లీ స్థానానికి ఢోకా లేదు. తను 3వ స్థానంలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. మహమ్మద్ షమీ ప్రపంచ కప్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.
