ముంబై : బాలీవుడ్ లో ప్రస్తుతం జనాదరణ పొందిన నటుల్లో ప్రత్యేకించి విలన్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ స్వంతం చేసుకున్న బాబీ డియోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు తనను విలన్ పాత్రలు చేయాలని కోరుతున్నారని అన్నాడు. అయితే ఈ విలనిజం ఇమేజ్ నుంచి బయటకు రావాలని ఉందన్నాడు. తనకంటూ భిన్నమైన పాత్రలలో పోషించాలన్న కోరిక బలంగా ఉందన్నాడు. ఇవాళ తను మీడియాతో మాట్లాడాడు. ప్రత్యేకించి తనకు రెండోసారి ఛాన్స్ ఇచ్చినందుకు తాను పాన్ ఇండియా దర్శకుడు వంగా సందీప్ రెడ్డికి రుణపడి ఉంటానన్నాడు. ఒకానొక సమయంలో ఛాన్స్ లు లేక నానా తంటాలు , తిప్పలు పడ్డానని వాపోయాడు. కానీ యానిమల్ సినిమాలో తనకు ఛాన్స్ ఇవ్వడంతో తనకు తిరుగు లేకుండా పోయిందన్నాడు బాబీ డియోల్.
ఇవాళ చేతినిండా సినిమాలు ఉన్నాయని, కానీ అన్నీ ఎక్కువగా విలన్ క్యారెక్టర్ కు సంబంధించినవే ఉన్నాయని వాపోయాడు. ఇటీవల వరుసగా విలన్ పాత్రలు పోషించిన బాబీ డియోల్ ఆ ఇమేజ్ నుండి బయట పడేందుకు ఉద్దేశపూర్వకంగానే విభిన్నమైన ప్రాజెక్టులను ఎంచుకుంటున్నట్లు చెప్పారు. నటుడు ఏదైనా పాత్రలో విజయం సాధించినప్పుడు, ఆ తర్వాత అదే తరహా పాత్రలకు పరిమితం కావడం సహజమని ఆయన అన్నారు. పరిశ్రమలో జరిగేది అదే. నేను దాని నుండి బయట పడటానికి చాలా ప్రయత్నిస్తున్నాను. నేను ఇటీవల ‘బందర్’ అనే సినిమా చేశాను, అది చాలా భిన్నమైనది అని 57 ఏళ్ల నటుడు పేర్కొన్నాడు. ఇందులో బాబీ డియోల్ తన మాజీ ప్రేమికురాలిచే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వయసు పైబడిన స్టార్‌గా నటించారు.
