న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేసిన కామెంట్స్ పై . ఆయన ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాడని అన్నారు. హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు పిలిస్తే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారని , అలా వెల్లడం తప్పా అని ప్రశ్నించారు. బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సీఎం ఇద్దరు కేంద్ర మంత్రులకు వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. మరి గతంలో హరీష్ రావు వేరే పార్టీల నాయకుల ఇళ్లకు వెళ్లలేదా..? అని ప్రశ్నించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
రేవంత్ రెడ్డి హైబ్రిడ్ విధానాన్ని క్రాస్ బీడ్ అంటున్న హరీష్ రావుకు సోయి లేదన్నారు ఎంపీ. క్రాస్ బీడ్, క్రాస్ ఓటింగ్ చేసి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించింది బీఆర్ఎస్ కాదా అని నిలదీశారు. కాంగ్రెస్ ను ఓడించాలని బీఆర్ఎస్ అవయవ దానం చేసి బీజేపీని గెలిపించిందని ఆరోపించారు. ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామని హరీష్ రావు కలలు కన్నాడని ఎద్దేవా చేశారు. మా మామ కేసీఆర్ తర్వాత నేను సీఎం అవుతా లేకపోతే మా కుటుంబ సభ్యులు అవుతారని హరీష్ రావు భావించారని కానీ అది వర్కవుట్ కాలేదన్నారు. రోజూ ఏదో ఒకటి మాట్లాడి కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని , ఇది మానుకోవాలని సూచించారు.
