మా కోటా మా వాటా ఇవ్వాల్సిందే : శ్రీ‌నివాస్ గౌడ్

స్వాతంత్రం వ‌చ్చాక మెజారిటీ వ‌ర్గాల‌పై వివ‌క్ష

న్యూఢిల్లీ : మాజీ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో బ‌హుజ‌నుల జ‌నాభా అధికంగా ఉన్న‌ప్ప‌టికీ రాజ‌కీయ ప‌రంగా, అధికార ప‌రంగా వారి వాటా స్వ‌ల్పంగా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆదివారం ఆయ‌న ఢిల్లీలో జ‌రిగిన కీల‌క స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు. స్వాతంత్రం వచ్చిన తరువాత మెజారిటీ వర్గాలకు న్యాయం జరుగడం లేదని వాపోయరు. రాజకీయంగా విద్య..ఉద్యోగ..ఉపాధి రంగాల్లో అణిచి వేయబడ్డారని అన్నారు. వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చి వాళ్ళ కోసం ఏం చేయడం లేద‌ని మండిప‌డ్డారు. ఎంత జనాభా ఉంటె అంత రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పిన‌ రాహుల్ గాంధీ ఇప్పుడు నోరు ఎందుకు మెద‌ప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. సెన్సస్ లో బీసీ జన గణన చేస్తామని బీజేపీ ఆచరించడం లేద‌ని మండిప‌డ్డారు శ్రీ‌నివాస్ గౌడ్. భారత దేశంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే మెజారిటీ వర్గాలను అక్కున చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. లేక‌పోతే ఆయా పార్టీల‌కు రాజ‌కీయ ప‌రంగా మ‌నుడ ఉండ‌ద‌న్నారు.

తమిళనాడు, పంజాబ్, కర్ణాటక, తెలంగాణాలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు రాష్టాల్లో ఇచ్చారన్నారు. న్యాయపరంగా ఇబ్బందులు వస్తున్నాయి.. రాజ్యాంగ బద్దంగా లేదని కోర్ట్ లు కొట్టేస్తున్నాయని వాపోయారు. సెన్సెస్ లో లేనప్పుడు ఇంత పెర్సెంటేజి అని రిజర్వేషన్లు ఎలా ఇస్తారని న్యాయస్థానాలు అడుగుతున్నాయ‌ని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ చేయాల‌ని, సెన్సస్ లో బీసీ గణన చేయాలని శ్రీ‌నివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్ర‌తిప‌క్ష పార్టీగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాల‌న్నారు. ప్రతి కులానికి ఒక నంబరింగ్ ఇవ్వకుండా ఎలా న్యాయం చేస్తారంటూ ప్ర‌శ్నించారు. సర్వే తో ఒక్క రూపాయి ఖర్చు కాదన్నారు. హౌస్ హోల్డ్ సెర్వే లో ఎక్కడా కుల గణన ప్రస్తావన లేదన్నారు. ప్రతిపక్ష పార్టీ మాట్లాడటం లేదు.. అధికార పార్టీ అసలు పట్టించు కోవడం లేదు.. వీళ్ళ సంఖ్య తెలిస్తే పునాదులు కదులుతాయని భయపడుతున్నారా?? అని నిల‌దీశారు శ్రీ‌నివాస్ గౌడ్. బ్యాంకు లను ఎగ్గొటిన వారిలో బీసీ లు లేరు. మోసం చేసిన వారిలో కూడా బీసీలు లేరన్నారు. 80 కోట్ల జనాభా ఉన్న ఓబీసీ లకు చట్ట సభల్లో జనాభాకు అనుగుణంగా లేరన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!