BJP MLA Raja Singh: కరీంనగర్ నుంచి వార్ మొదలైంది – ఎమ్మెల్యే రాజాసింగ్‌

కరీంనగర్ నుంచి వార్ మొదలైంది - ఎమ్మెల్యే రాజాసింగ్‌

Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కరీంనగర్ నుంచి వార్ మొదలైందని ప్రకటన చేశారు. అందరూ దొంగలు ఒక్కటయ్యారని రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. అంతకుముందు బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చిందంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌(Raja Singh) సమర్ధించారు.

BJP MLA Raja Singh Comments

పార్టీలోని కోవర్టులే తనని ఓడించారంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 25ఏళ్లుగా కేసీఆర్‌కు లేఖలు రాస్తున్నా… ఇప్పటి వరకు ఒక్క లేఖ కూడా లీకు కాలేదు. కానీ ఈ సారి రాసిన లేఖ ఎలా బహిర్గతం అయ్యింది. ఆ లీకు వీరులెవరో చెప్పాలి. నేను జైల్లో ఉండగా బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగింది.నేను పార్టీలో ఉంటే అది సాధ్యం కాదని, తనని కేసీఆర్‌కు దూరం చేయాలని చూస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

అయితే, కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాజా సింగ్‌… ఆఫ్ ద రికార్డు కవిత మాట్లాడినది నిజమే అని నేను అనుకుంటున్నాను. పెద్ద ప్యాకేజీ దొరుకుతే మా వాళ్ళు కూడా బీఆర్‌ఎస్‌తోనే కలిసిపోతారు. మా వాళ్లు కుమ్మక్కయ్యారు కాబట్టే బీజేపీకి నష్టం అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజా సింగ్ వ్యాఖ్యలు బీజేపీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

Also Read : Mamata Banerjee: బీజేపీ నేత అశ్లీల వీడియో, ఆపరేషన్‌ సిందూర్‌ వ్యాఖ్యలపై దీదీ ఆగ్రహం

Leave A Reply

Your Email Id will not be published!