Lufthansa Airlines: జర్మనీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు
జర్మనీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు
Lufthansa Airlines : మూడు రోజుల క్రితం జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రధానంగా ఎయిర్‌లైన్స్ నిర్వహణ సంస్థలకు ఆ విమాన ప్రమాదం మరింత అలజడి రాజేసింది. అదే సమయంలో విమానం మాటంటే ప్రజల్లో భయం కనిపిస్తోంది. ఇదిలా ఉంచితే… తాజాగా జర్మనీ నుండి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపుతో కలకలం రేగింది. దీనితో అప్రమత్తమైన విమానం సిబ్బంది… రెండు గంటల ప్రయాణం అనంతరం తిరిగి వెనక్కి వెళ్లి జర్మనీలో సురక్షితంగా విమానాన్ని ల్యాండింగ్ చేసారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Lufthansa Airlines – Bomb Threats
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ (Lufthansa Airlines) కు చెందిన విమానం కు బాంబు బెదిరింపు వచ్చింది. దీనితో సుమారు రెండు గంటల ప్రయాణం అనంతరం విమానాన్ని మళ్లీ ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. అనంతరం విమానాన్ని ఆధీనంలోకి తీసుకొని భద్రత చర్యలు చేపట్టారు. బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన ఎల్‌హెచ్ 752 విమానం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్టు నుంచి అక్కడి కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి సోమవారం ఉదయం 1.20 గంటలకు చేరుకోవాలి. అయితే బాంబు బెదిరింపు కారణంగా బల్గేరియన్ గగనతలంలో ఉన్న విమానాన్ని వెనక్కి మళ్లించారు.
Also Read : Spinal Muscular Atrophy: చిన్నారికి పెద్ద కష్టం ! వైద్యానికి రూ.16 కోట్లు అవసరం !
