Maharashtra Coast: ‘మహా’తీరంలో విదేశీ నౌక హల్ చల్
‘మహా’తీరంలో విదేశీ నౌక హల్ చల్
Maharashtra Coast : మహారాష్ట్ర తీరంలో విదేశీ నౌక హల్ చల్ చేయడం కలకలం రేపింది. రేవ్‌దండాలోని కొర్లాయ్ తీరానికి రెండు నాటికల్ మైళ్ల దూరంలో భారత నావికాదళ రాడార్ సముద్రంలో ఒక అనుమానాస్పద నౌకను గుర్తించారు. దీనితో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, రాయ్‌గఢ్ పోలీసులు బాంబు నిర్వీర్య బృందంతో అక్కడికి చేరుకున్నారు. ఈ పడవ ఏ దేశానికి చెందింది? ఏ మార్గంలో వచ్చిందన్న కోణాల్లో నౌకాదళం, తీరగస్తీ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ఆ పడవపై వేరే దేశానికి చెందిన గుర్తులున్నట్లు సోమవారం అధికారులు వెల్లడించారు. ఇది పాకిస్థాన్‌కి చెందిన పడవగా అనుమానిస్తున్నారు. అది తీరానికి కొట్టుకొచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.
Maharashtra Coast Area Identified
భారీ వర్షం (Rains), బలమైన ఈదురుగాలుల కారణంగా పడవ ఉన్న ప్రాంతానికి చేరుకునేందుకు తీవ్ర ఆటంకం ఎదురవుతోందని అధికారులు తెలిపారు. ఈ పరిణామాలతో తీర ప్రాంతంతో పాటు జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా తీరంలో భారీగా పోలీసులను మోహరించారు. రేవ్‌దండా తీరం సమీపంలో ఈ అనుమానాస్పద నౌక కనిపించిన దరిమిలా మహారాష్ట్రలోని (Maharashtra) రాయ్‌గఢ్ తీరం వెంబడి భద్రతను మరింతగా పెంచారు.
తీరం వెంబడి పోలీసు దళాలను మోహరించారు.
ముందు జాగ్రత్త చర్యగా రాయగఢ్ జిల్లాలో భద్రతను పెంచారని ఒక అధికారి తెలిపారు. ఆదివారం రాత్రి భారత నావికాదళ రాడార్ రెవ్‌దండాలోని కొర్లై తీరానికి రెండు నాటికల్ మైళ్ల దూరంలో అనుమానస్పద నౌకను గుర్తించింది. ప్రస్తుతం పోలీసులు, సముద్రతీర భద్రతా సిబ్బంది ఆ నౌక కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రాయ్‌గడ్ పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ), బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్), నేవీ కోస్ట్ గార్డ్ సిబ్బంది అనుమానాస్పద నౌక ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. రాయ్‌గడ్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్ఫీ) అంచల్ దలాల్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు తీరానికి చేరుకున్నారు. ఆ నౌకను చేరుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే వాతావరణం అనుకూలంగా లేని కారణంగా వారు వెనుదిరిగారు. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా పడవను గుర్తించి, దానిని చేరుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు.
Also Read : CM Rekha Gupta: యోగి ఆదిత్యనాథ్ కు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సంచలన లేఖ !
