Minister Nara Lokesh: నేడు దిల్లీకు మంత్రి నారా లోకేశ్ ! పలువురు కేంద్రమంత్రులతో భేటీ ?
నేడు దిల్లీకు మంత్రి నారా లోకేశ్ ! పలువురు కేంద్రమంత్రులతో భేటీ ?
Nara Lokesh : ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రి దిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించేందుకు సోమవారం పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. మంత్రి లోకేశ్ చొరవతో రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టుల రాకతోపాటు వేగంగా అనుమతులు మంజూరయ్యాయి. ఇటీవల రాష్ట్రానికి సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలు పోటీపడగా… కీలక ప్రయత్నాలు చేసి రాష్ట్రానికి వచ్చేలా మంత్రి లోకేశ్ కృషి చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
మంత్రి నారా లోకేశ్ సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరస భేటీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే.. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. సమావేశాల్లో భాగంగా రాష్ట్రానికి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలపనున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర రోడ్డు రవాణా, రహదార్ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఓడరేవులు, జలరవాణాశాఖ మంత్రి సర్పానంద్ సోనోవాల్ సమావేశం కానున్నారు. అనంతరం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో మంత్రి లోకేశ్ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. చర్చల్లో భాగంగా లోకేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున వివిధ ప్రతిపాదనలను కేంద్రమంత్రులకు అందజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ ప్రతిపాదనలను కేంద్రమంత్రులకు అందజేయనున్నారు.
Nara Lokesh – జెండా ఎగరవేయకపోవడం జగన్ అహంకారానికి నిదర్శనం – లోకేశ్
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఐటీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మరోసారి విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతీయ జెండా ఎగరవేయకపోవడం జగన్ అహంకారానికి నిదర్శనం ఆయన ఆరోపించారు. ఇది మన స్వాతంత్ర పోరాటాన్ని అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకుగాను… జగన్ భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఇన్సెల్ట్స్ నేషన్ అనే ట్యాగ్ లైన్లతో మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
జగన్‌కు కుట్ర రాజకీయాలు తప్ప దేశభక్తి, రాష్ట్రం పట్ల అభిమానం లేవని లోకేశ్ విమర్శించారు. ఐదేళ్లు సీఎం పదవిని అనుభవించి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జగన్ కానీసం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కూడా పాల్గొనక పోవడం ఆయన అవివేకమని ఆరోపించారు. ప్రతిఒక్కరూ ఆగస్టు 15న జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తిని చాటుకుంటారని తెలిపారు. జగన్ ఎక్కడ పాల్గొనక పోవడానికి కారణం వైసీపీ నేతలే చెప్పాలని చురకలు పెట్టారు.
Also Read : AP High Court: ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్ కు వారెంట్ జారీ చేసిన హైకోర్టు
