Children: కర్నూలు జిల్లాలో ఘోర విషాదం ! నీటి కుంటలో దిగి ఆరుగురు చిన్నారుల మృతి !

కర్నూలు జిల్లాలో ఘోర విషాదం ! నీటి కుంటలో దిగి ఆరుగురు చిన్నారుల మృతి !

Children : కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో ఈతకు దిగి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. ఆస్పరి మండలం చిగలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు గ్రామ శివారులోని కొండ ప్రాంతంలో ఉన్న కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంటలో భారీగా నీరు చేరింది. ఈ క్రమంలో కుంటలో ఈతకు దిగిన విద్యార్థుల్లో శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మహబూబ్ ప్రాణాలు కోల్పోయారు. గట్టున ఉన్న విద్యార్థి వెంటనే ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. గ్రామంలోని వారికి విషయం చెప్పాడు. గ్రామస్తులు పరుగు, పరుగున కుంట దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే ఘోరం జరిగిపోయింది. ఆరుగురు చిన్నారులు మృతి చెందడంతో చిగలి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Children – సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఆరుగురు చిన్నారులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు నీటికుంటలో ఈతకు దిగి మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారుల మృతి వారి కుటుంబాలకు తీరని కడుపుకోత మిగిల్చిందన్నారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన సీఎం.. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Also Read : Botcha Satyanarayana: స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు త్వరలోనే ఉద్యమం – మాజీ మంత్రి బొత్స 

Leave A Reply

Your Email Id will not be published!