Telangana Congress: జూబ్లీహిల్స్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌!

జూబ్లీహిల్స్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌!

Telangana Congress : జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ (Telangana Congress) నేత నవీన్ యాదవ్‌ పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. మధురా నగర్ పోలీస్ స్టేషన్‌లో జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి నవీన్ యాదవ్‌ పై ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు నవీన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నవీన్ యాదవ్‌ ఓటర్ కార్డులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. దీన్ని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి చర్యగా భావించిన ఎన్నికల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నవీన్ యాదవ్ మీద బీఎన్ఎస్ 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘనల మీద అధికారుల సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana Congress Comments

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ (Telangana Congress) నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదు అవ్వడం కాంగ్రెస్‌కు భారీ దెబ్బగా చెప్పుకొవచ్చు. నవీన్ యాదవ్‌ను జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా అనుకున్నట్లు రాజకీయా వర్గాల్లో వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్‌పై కేసు నమోదు అవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా… ఎన్నికల సంఘంకు ఎంపీ రఘునందన్ రావు, నవీన్ యాదవ్‌ జూబ్లీహిల్స్‌లో ఓటర్ కార్డులు అందజేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన ఎన్నికల సంఘం.. నవీన్ యాదవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీ‌హిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ కీలక నేత నవీన్‌ యాదవ్‌పై క్రిమినల్‌ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ ఓటరు కార్డులను పంపిణీ చేయడంతో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు.

గెలిపించాక పార్టీ మారితే తుక్కుతుక్కు చేస్తాం – ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి హెచ్చరికలు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు కష్టపడి గెలిపించాక అభ్యర్థులు పార్టీ మారితే వదిలిపెట్టం. వెయ్యి మందిని తీసుకొచ్చి వారి ఇంటి మీద దాడి చేసి.. తుక్కుతుక్కు చేస్తాం’ అని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో భారత రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు గెలిచాక పార్టీ మారితే తస్మాత్‌ జాగ్రత్త అని హెచ్చరించారు. ఇది నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని పార్టీ అభ్యర్థులందరికీ వర్తిస్తుందని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలనే వదిలిపెట్టలేదని, మిమ్మల్ని ఎలా విడిచిపెడతామని పేర్కొన్నారు.

Also Read : President Award Interesting : తెలంగాణ విద్యార్థికి ఎన్‌ఎస్‌ఎస్‌ అవార్డు

Leave A Reply

Your Email Id will not be published!