కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండికి పొన్నం ఘాటు లేఖ
రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలులో నిర్లక్ష్యం తగదు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర సర్కార్ వివక్ష ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఈ సందర్బంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు బహిరంగ లేఖ రాశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, ఇది మంచి పద్దతి కాదన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు కేబినెట్ లో ఉన్నా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ఇదేనా మీ చిత్తశుద్ది అని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్రం దయ కాదనని, తెలంగాణ హక్కు అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు పన్నలు చెల్లిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని నిలదీశారు. పార్లమెంట్ లో జరుగుతున్న కేంద్ర బడ్జెట్ చర్చ లో తెలంగాణ కి సంబంధించిన రావాల్సిన నిధులు ,పెండింగ్ ప్రాజెక్ట్ లు పై కేంద్ర మంత్రులు ఎందుకు చర్చించడం లేదని ఫైర్ అయ్యారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తున్నారని, కానీ తెలంగాణ వరకు వచ్చేసరికి పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించడం ఎంత వరకు సబబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలు, రాజకీయాలు వేరు అని, రాష్ట్ర అభివృద్ధి పై వివక్ష వద్దన్నారు. మంత్రులు కేంద్రంతో కొట్లాడి నిధులు సాధించాలని హితవు పలికారు. లేకపోతే కిషన్ రెడ్డిని, బండి సంజయ్ లను ప్రజలు క్షమించరని హెచ్చరించారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
