10 రోజుల‌కే విజ‌య్ ని విమ‌ర్శిస్తే ఎలా..?

నిప్పులు చెరిగిన న‌టి ఖుష్బూ సుంద‌ర్

చెన్నై : ప్ర‌ముఖ న‌టి, బీజేపీ నాయ‌కురాలు ఖుష్బు సుంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె మ‌ర్యాద పూర్వ‌కంగా కొత్త‌గా కొలువు తీరిన అగ్ర న‌టుడు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఇద్ద‌రూ ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. అనంత‌రం ఖ‌ష్బు సుంద‌ర్ మీడియాతో మాట్లాడారు. విజ‌య్ నేతృత్వంలోని టీవీకే స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చి కేవ‌లం 10 రోజులు మాత్ర‌మే అయ్యింద‌ని, అప్పుడే విమ‌ర్శించ‌డం మొద‌లు పెట్టార‌ని , అలా ఆధారాలు లేకుండా ఎలా నిందిస్తారంటూ ప్ర‌శ్నించారు. డీఎంకే కొన్నేళ్లుగా రాష్ట్రాన్ని పాలించి విఫ‌ల‌మైంద‌ని దానికి మ‌రి వారు ఏం స‌మాధానం చెబుతారంటూ నిల‌దీశారు ఖుష్భు సుంద‌ర్. విజ‌య్ ని క‌ల‌వ‌డం, త‌న‌ను సీఎంగా చూడ‌టం మ‌రిచి పోలేని క‌ల‌గా ఉంద‌న్నారు. ఇది ఊహించ‌ని స‌న్నివేశం అని పేర్కొన్నారు. తాను న‌టిగా, స్మ‌ల్ స్క్రీన్ ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ అధ్య‌క్షురాలిగా మాత్ర‌మే విజ‌య్ ని క‌లిశాన‌ని, బీజేపీ నాయ‌కురాలిగా కాద‌న్నారు.

సమావేశానికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. సీఎంను క‌ల‌వ‌డం, త‌న‌ను అభినందించ‌డం, త‌న ప్ర‌తినిధి టీంకు ల‌భించిన గౌర‌వం, అదృష్టం కూడా అని పేర్కొంది ఖుష్బు సుంద‌ర్. త‌న‌ను త‌మ్ముడు అని సంబోధించింది. త‌ను కొత్త రాజ‌కీయ పాత్ర‌లోకి మారిన‌ప్ప‌టికీ ప‌ర‌స్ప‌ర గౌర‌వ బంధం చెక్కు చెద‌ర లేద‌ని అన్నారు . ఇక తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు విజయ్ రాజకీయ ప్రస్థానంలోనూ, ఆయన పార్టీ అయిన తమిళగ వెట్రి కజగం (టీవీకే)లోనూ ఎక్కువగా పాలు పంచుకుంటున్న తరుణంలో ఈ సమావేశం జరగ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. విభిన్న సైద్ధాంతిక నేపథ్యాలు ఉన్నప్పటికీ త‌న‌ను క‌లిసేందుకు వ‌స్తున్నారు. ఇదిలా ఉండగా రాజకీయ, సాంస్కృతిక కోణంలో మాత్రమే చూడబడుతున్న ఈ సమావేశానికి ఖుష్బూ వ్యాఖ్యలు ఒక వ్యక్తిగత కోణాన్ని జోడించాయి.

Leave A Reply

Your Email Id will not be published!