కేరళ : తమిళనాడు ముఖ్యమంత్రిగా కొలువు తీరిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రముఖ మలయాళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నటుడు, రాజకీయ నాయకుడు సురేష్ గోపి. ఆయన ఇటీవలే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తను ఎవరూ ఊహించని రీతిలో సక్సెస్ అయ్యాడు. తను ఏదో చేస్తాడని తమిళనాడు ప్రజలు నమ్మారు. అందుకే ఆయనకు విజయాన్ని చేకూర్చి పెట్టారు. ఇందులో తాను కూడా సంతోషిస్తానని ఒక నటుడిగా అని పేర్కొన్నారు. తనకు కూడా వ్యక్తిగతంగా విజయ్ తో పరిచయం ఉందన్నాడు సురేష్ గోపి. తను అద్భుతమైన నటుడు. అంతే కాదు మానవత్వం కలగలసిన వ్యక్తి అని ప్రశంసించాడు.
గత 15 రోజులుగా ఆయన చేపట్టిన చర్యలను మీరు ఎలా చూస్తున్నారు? ఆయన పార్టీ కేరళలో కూడా అడుగు పెట్టబోతోందని అంటున్నారు ..దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అని మీడియా అడిగిన ప్రశ్నకు చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు. ముందుగా జోసెఫ్ విజయ్ ని తన పని చేసుకోనివ్వండి. అసలు పని మొదలు కాకముందే తాను వ్యాఖ్యానించడం సరైనది కాదని తాను అనుకుంటున్నట్లు చెప్పారు సురేష్ గోపి. ఇప్పుడు మాట్లాడటం సరి కాదన్నారు. మార్పు సరిగ్గా రావడం లేదు, పరిస్థితి మెరుగుప డుతున్నట్లు కనిపించడం లేదు అని నలుగురిలో చెప్పుకుంటూ తిరగాల్సిన అవసరం ఏముంది సార్? జోసెఫ్ విజయ్ తప్పక మంచి పని చేస్తారు. ప్రజలు ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. ఆయన్ని మంచిగా పని చేసుకోనివ్వండి అంటూ సూచించారు. ప్రస్తుతం సురేష్ గోపి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.