గుంటూరు జిల్లా : ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన టీడీపీ మహానాడు లో ఆయన ప్రసంగించారు. ఇరిగేషన్ గురించి మాట్లాడాల్సి వస్తే టిడిపికి ముందు టిడిపికి తరువాతేనని అన్నారు. ఏ ప్రాజెక్టు ఎప్పుడు మొదలు పెట్టాలో ,ఎప్పుడు పూర్తి చేయాలో తమ నాయకుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్దేశించారని చెప్పారు. మాజీ సీఎం జగన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆయన తన పాలనా కాలంలో ఇరిగేషన్ శాఖకు 18 వేల కోట్ల బకాయిలు వారసత్వంగా ఇచ్చాడని ఆరోపించారు నిమ్మల రామానాయుడు. గొడ్డలి పార్టీ 5 ఏళ్ళలో చేయలేని పనులు 23 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసి చూపించిందన్నారు.
చెప్పిన మాట ప్రకారం హంద్రీనీవా పనులు పూర్తి చేసి తొలి ఏడాదిలోనే 727 కి.మీ దూరంలోని కుప్పానికి కృష్ణా జలాలు తీసుకెళ్ళాం అని తెలిపారు నిమ్మల. జూన్ లో కేంద్రమంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక, ఎపి రాష్ట్రాల సిఎంలు తుంగభద్ర గేట్లు ప్రారంభిస్తారని వెల్లడించారు. 22 నెల్లోనే పోలవరం నిర్వాసితులకు 2250 కోట్లు పంపిణీ చేశాం అన్నారు. పూర్తవ్వని వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతాంగాన్ని జగన్ మోసం,ద గా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం లో వెలిగొండ కోసం 2500 కోట్లు ఖర్చు చేశామన్నారు నిమ్మల రామానాయుడు.203 కోట్లతో శ్రీశైలం డ్యాం మరమ్మత్తులు చేస్తున్నాం అని తెలిపారు. 23 నెలల్లో ఇరిగేషన్ శాఖలో 23 వేల కోట్లు ఖర్చు చేశాం అన్నారు. 3 ఏళ్ళలో 36 ప్రాజెక్టులు పూర్తి చేసేలా సిఎం చంద్రబాబు షెడ్యూల్ రిలీజ్ చేశారన్నారు. వంశధార, నగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానమే చంద్రబాబు లక్ష్యం అని చెప్పారు.