ముంబై : ముంబై ఇండియన్స్ జట్టు స్కిప్పర్ హార్దిక్ పాండ్యాపై బీసీసీఐ గుర్రుగా ఉందా. అవుననే సమాధానం వస్తోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్ జరిగింది. తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 195 రన్స్ చేసింది. అనంతరం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 196 రన్స్ చేసింది. వరుసగా ఆ జట్టుకు ఇది నాలుగవ విజయం. ఇక కీలక మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
ఎంఐ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ సందర్భంగా, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాల మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ సెట్ చేస్తున్నప్పుడు, అతను తన సొంత వ్యూహానికే పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు కనిపించాడు. జస్ప్రీత్ బుమ్రా సలహాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. బుమ్రా మొదట తన వాదనను వినిపించడానికి ప్రయత్నించాడు. కానీ బుమ్రా ఒక సీనియర్ ఆటగాడన్న విషయాన్ని హార్దిక్ పాండ్యా మరిచి పోయినట్లు కనిపించాడు. ఈలోగా, పీబీకేఎస్ బ్యాట్స్‌మెన్ నిరంతరం పరుగులు సాధిస్తూనే ఉన్నారు.. వికెట్లు పడలేదు.
ఈ పరిస్థితిలో, హార్దిక్ తన అసహనాన్ని స్పష్టంగా బుమ్రాపై చూపించాడు. మైదానంలో, హార్దిక్ అతనిపై కోపం ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమైంది. ఇప్పుడు, ముంబై ఇండియన్స్ జట్టు పూర్తిగా విచ్ఛిన్నమవుతున్నట్లు కనిపిస్తోంది. దానికి హార్దిక్ పాండ్యానే కారణమని నిందలు మోపుతున్నారు. అతని కోపం, వైఖరి జట్టు వాతావరణాన్ని పాడు చేశాయని అంటున్నారు.
