టీడీపీ డీఎన్ఏలోనే బీసీలు ఉన్నారు : సీఎం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు బీసీల గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ అంటేనే బీసీలు అని అన్నారు. దివంగ‌త ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ముందు నుంచీ వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు పెద్ద‌పీట వేసింద‌న్నారు. దేశంలో ఏ పార్టీ బీసీల‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌లేద‌న్నారు. టీడీపీ డీఎన్ఏలోనే బీసీలు ఉన్నారని చెప్పారు. బీసీలకు- టీడీపీకి దశాబ్దాల అనుబంధం ఉంద‌న్నారు. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అని చెప్పారు. నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల వేతనం, వడ్డెర్లకు, గీత కార్మికులకు గనులు, మద్యం దుకాణాలను కేటాయిస్తున్నాం అన్నారు. 45 ఏళ్లుగా బీసీలు టీడీపీని ఆదరించారని పేర్కొన్నారు. వారి రుణం తీర్చుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

బీసీల కోసం, బీసీ మహిళల కోసం కొత్త విధానాలను అమల్లోకి తెచ్చి.. వారిని ఆర్థికంగా చేయూత ఇస్తున్నాం అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. సీవీడ్ లాంటి కొత్త ప్రత్యామ్నాయాలను ఎంచుకోవటం ద్వారా అదనపు ఆదాయం సంపాదించేలా చర్యలు చేపడతాం అన్నారు. మత్స్య కారుల జీవన ప్రమాణాలు పెంచటమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మత్స్య కార యువతకు నైపుణ్యాలు నేర్పి ఆదాయాన్ని రెట్టింపు చేసేలా ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు చంద్ర‌బాబు నాయుడు. ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా ప్రజల సేవకులే. జవాబుదారీతనంతో పనిచేయాలనే లక్ష్యాన్ని పెట్టాం అన్నారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం మనపై కూడా పడిందన్నారు. ఆయిల్ ధరలు పెరిగాయి. గ్యాస్ కొరత ఉందన్నారు. మనం అంతా నా దేశం- నా బాధ్యత అనుకుని పని చేయాలన్నారు. ప్రధాని మోదీ 7 సూత్రాలను సూచించారని తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. అనవసరపు ప్రయాణాలు తగ్గించుకుందాం అని సూచించ‌రాఉ. ప్రజా రవాణాను మాత్రమే వినియోగిద్దాం అని సూచించారు సీఎం.

Leave A Reply

Your Email Id will not be published!