న్యూఢిల్లీ : ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన గూగుల్ ఏఐ హబ్ చరిత్ర సృష్టించిందన్నారు. ఏకంగా 15 బిలియన్లను పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఇంపాక్ట్ సమ్మిట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కీలక సూచనలు చేశారు. ఏఐ వల్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని ఉద్యోగాలు పోతే పోవచ్చు కానీ వాటి స్తానంలో కొత్త ఉద్యోగాలు వస్తాయని, అందుకు అనుగుణంగా తమను తాము తీర్చి దిద్దు కోవాలని సూచించారు. ఈ సందర్భంగా గూగుల్ సీఈవోకు ధన్యవాదాలు తెలిపారు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘనత ఏపీకి దక్కిందన్నారు.
ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. నిరాడంబరమైన తీరప్రాంత నగరమైన విశాఖపట్నం ఇప్పుడు గ్లోబల్ ఏఐ హబ్‌గా మారుతోందని అన్నారు మంత్రి. ఈ హబ్‌లో పెద్ద ఎత్తున కంప్యూట్ , సబ్‌సీ కేబుల్ గేట్‌వే ఉంటాయన్నారు. ఇవి భారతదేశానికి ఉద్యోగాలతో పాటు ఏఐ సామర్థ్యాలను తీసుకు వస్తాయన్నారు. ఈ పరివర్తన సాంకేతికత , మౌలిక సదుపాయాలు ఎంతవరకు అభివృద్ధి చెందాయో ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. డేటా రెసిడెన్సీ, భద్రతతో పాటు దీర్ఘకాలిక దేశీయ సామర్థ్య విలువపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. సిద్ధంగా ఉన్న డేటా సెంటర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఓపెన్‌ఏఐ , టాటా గ్రూప్ భాగస్వామ్యం అవుతాయని తెలిపారు.
