ఇరాన్ : మరో యుద్దానికి తెర తీయనున్నాడా అమెరికా బాస్ ట్రంప్. ఆయన గత కొంత కాలంగా పలు దేశాలపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ మధ్యన ఇండియాను బెదిరించారు. రష్యాతో సంబంధం తెంచు కోవాలని ఒత్తిడి చేశాడు. ఆపై సుంకాలు విధించాడు. ఆపై హెచ్ 1 బి వీసాలను ఇచ్చేది లేదంటూ బాంబు పేల్చాడు. రోజుకో ప్రకటన చేస్తూ ప్రపంచంలో ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ తరుణంలో ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అణుబాంబును ప్రయోగిస్తామని ప్రకటించాడు. దీనిపై ఇరాన్ స్పందించింది. డోంట్ కేర్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్య తీసుకుంటామని పదే పదే బెదిరించడం పట్ల తప్పు పట్టింది. నీకు అంత సీన్ లేదంటూ మండిపడింది.
ఈ మేరకు ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ట్రంప్ పై , ఆయన చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగాడు. ఇక్కడ చేతులు కట్టుకుని ఎవరూ లేరని , తమకు కూడా సరైన బలగం ఉందంటూ ప్రకటించాడు. ఎలాంటి చర్యలనైనా ఎదుర్కొనే సత్తా తమకు ఉందని ప్రకటించాడు. అన్నింటిని తట్టుకునే సామర్థ్యం, శక్తి తమలో ఉందని, వెనక్కి తగ్గబోమంటూ వెల్లడించాడు ఖమేనీ. ఈ సందర్భంగా ఇరాన్ అణుశక్తి చీఫ్ గురువారం మీడియాతో మాట్లాడాడు. ఏ దేశం కూడా ఇరాన్ అణుశక్తి హక్కును హరించదని స్పష్టం చేశాడు. రాన్ అణు కార్యక్రమం అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ నిబంధనల ప్రకారం కొనసాగుతోందని అన్నాడు మొహమ్మద్ ఎస్లామి ఇరాన్ .
