ముంబై : ప్రస్తుతం భారత జట్టు ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో వరుసగా విజయాలు సాధించినా ఆ జట్టును, మేనేజ్ మెంట్ ను ప్రధాన సమస్య వెంటాడుతూనే ఉంది. పనిగట్టుకుని స్టార్ ప్లేయర్లు శాంసన్, అభిషేక్ శర్మలను ప్రమోట్ చేశారు ఓపెనర్లుగా. కానీ విచిత్రం ఏమిటంటే ఇద్దరూ ఆశించిన మేర రాణించలేక పోయారు. అంచనాలకు దగ్గరగా రాలేక పోవడంతో జట్టు హెడ్ కోచ్ , మేనేజ్మమెంట్ పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న భారత్ ప్రస్తుతం సూపర్ 8కి చేరుకుంది. జట్టు అన్ని విభాగాలలో బలంగా ఉన్నప్పటికీ ప్రధాన సమస్య ఓపెనింగ్ విషయంలోనే . ఇక వరల్డ్ లో నెంబర్ 1 బ్యాటర్ గా పేరు పొందాడు అభిషేక్ శర్మ.
కానీ అనూహ్యంగా వరల్డ్ కప్ లో వరుసగా డకౌట్లతో నిరాశ పరిచాడు. అందరినీ విస్తు పోయేలా చేశాడు. ఈ తరుణంలో ఎవరూ ఊహించని రీతిలో సందీప్ కిషన్ రంగంలోకి వచ్చాడు. సూపర్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మరో వైపు శాంసన్ ఇంకా పరుగుల కోసం నానా తంటాలు పడుతున్నాడు. ఈ తరుణంలో గంభీర్ ప్రయోగాలకు తెర తీస్తాడా లేక అభిషేక్ శర్మను ఇలాగే కంటిన్యూ చేస్తాడా అనేది ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ అలాగే కొనసాగిస్తే జట్టులోని ఇతర ఆటగాళ్లపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఒత్తిడికి లోను కాకుండా ఆడేవాళ్లు కావాలి. ఇదిలా ఉండగా టోర్నీలో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతోంది భారత జట్టు. టోర్నీలో బలమైన టైటిల్ ఫెవరేట్ గా ఉన్న సఫారీలతో తలపడనుంది.
