న్యూఢిల్లీ : పశ్చిమాశియాలో చోటు చేసుకున్న యుద్ద వాతావరణం నేపథ్యంలో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సంచలన ప్రకటన చేశారు. లోక్ సభలో పలువురు ఎంపీలు దేశంలో నెలకొన్న గ్యాస్ , పెట్రోల్ , ఆయిల్ కొరతలపై ప్రశ్నించారు. దీనిపై సీరియస్ గా స్పందించారు పీఎం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర సర్కార్ అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. ఈ విపత్కర, క్లిష్ట సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. కానీ కొందరు కావాలని ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేయడం పట్ల సీరియస్ అయ్యారు నరేంద్ర మోదీ.
ప్రస్తుతం దేశం దగ్గర 53 మిలియన్ మెట్రిక్ టన్నుల రిజర్వ్ నిల్వలు ఉన్నాయని ప్రకటించారు. ఏ ఒక్క వినియోగదారుడు భయపడాల్సిన , ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు పెట్రోల్, గ్యాస్ కొరత లేకుండా చూస్తున్నాం అని చెప్పారు. 60 శాతం LPGని భారత్‌లో ఉత్పత్తి చేస్తున్నాం అని తెలిపారు. హర్మూజ్ నుంచి షిప్స్ సురక్షితంగా వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు నరేంద్ర మోదీ. ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మరోసారి సభ సాక్షిగా ప్రకటించారు నరేంద్ర మోదీ. కరోనా సమయంలోనూ ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం అని తెలిపారు. పవర్‌ప్లాంట్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలపై పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. అన్ని రకాలుగా ముందస్తుగా ఆరు నెలలకు సరిపడా నిల్వలు ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నరేంద్ర మోదీ.
