Eatala Rajender : బీజేపీని వీడ‌ను కాంగ్రెస్ లో చేర‌ను

ఆ ప్ర‌చారమంతా శుద్ధ అబ‌ద్దం

Eatala Rajender : మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న పార్టీ మారుతున్నార‌ని, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ తో విభేదాలు వ‌చ్చాయ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దీంతో ఈట‌ల గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. కొంద‌రు కావాల‌ని దుష్ప్రచారం చేస్తున్న‌రాని ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. తాను ఉద్య‌మ‌కారుడిన‌ని, కొన్ని విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్న నాయ‌కుడిన‌ని ఇలాంటి చ‌వ‌క‌బారు ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం, ప్ర‌చారం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

తాను ఏమిటో త‌న జీవితం ఏమిటో త‌న నియోజ‌క‌వర్గ ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసన్నారు. ఎవ‌రు కావాల‌ని ఇలాంటి ప్ర‌చారం చేస్తున్నారో త్వ‌ర‌లోనే తేలుతుంద‌న్నారు ఈట‌ల రాజేంద‌ర్. తాను భార‌తీయ జ‌న‌తా పార్టీని వీడే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఒక‌సారి పార్టీ మారాక ఇంకో పార్టీలోకి ఎలా జంప్ అవుతాన‌ని ప్ర‌శ్నించారు. ఓడినా లేదా గెలిచినా తాను ఒకే పార్టీలో ఉంటాన‌ని అది బీజేపీనేని పేర్కొన్నారు ఈట‌ల రాజేంద‌ర్.

త‌న గ‌మ్యం, ల‌క్ష్యం ఒక్క‌టేన‌ని అది కేసీఆర్ ను గ‌ద్దె దించ‌డ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని దీనిని అంతం చేసేంత దాకా తాను నిద్ర పోన‌ని, పోనివ్వ‌న‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జ‌లు మేల్కొన్నార‌ని మార్పు త‌థ్య‌మ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు ఈట‌ల రాజేంద‌ర్. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాను పార్టీ ప‌ని మీద వెళ్లాన‌ని అది కూడా రాజ‌కీయం చేస్తారా అంటూ ప్ర‌శ్నించారు.

Also Read : PM Modi

Leave A Reply

Your Email Id will not be published!