Nara Lokesh Slams : అరెస్ట్ చేసినా యువ‌గ‌ళం ఆగ‌దు

టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్

Nara Lokesh Slams : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఏపీలో అమ‌రావ‌తి ఇన్న‌ర్ రోడ్డు అలైన్మెంట్ స్కాం కేసులో ఎ14గా త‌న‌ను ఏపీ సీఐడీ చేర్చ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. మంగ‌ళ‌వారం తీవ్రంగా స్పందించారు.

Nara Lokesh Slams YS Jagan

తాను చేప‌ట్టిన యువ గ‌ళం పేరు వింటేనే సైకో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జంకుతున్నాడ‌ని ఎద్దేవా చేశారు. నా పాద‌యాత్ర ఆరంభం కాకూడ‌ద‌ని జీవో1 తెచ్చినా ఆగ‌లేద‌న్నారు. జ‌న‌గ‌ళ‌మై గ‌ర్జించింద‌ని పేర్కొన్నారు. ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసినా ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని స్ప‌ష్టం చేశారు.

మ‌ళ్లీ యువ గ‌ళం ప్రారంభిస్తామ‌ని చెప్పే స‌రికి త‌న శాఖ‌కు సంబంధం లేద‌ని , అస‌లు వేయ‌ని రింగ్ రోడ్డు కేసులో నన్ను చేర్పించాడు 420 సీఎం జ‌గ‌న్ రెడ్డి అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు నారా లోకేష్(Nara Lokesh). మ‌ర‌మ్మ‌త్తుల పేరుతో రాజ‌మహేంద్రం బ్రిడ్జి మూసి వేయించారంటూ మండిప‌డ్డారు నారా లోకేష్.

నువ్వెన్ని త‌ప్పుడు కేసులు పెట్టినా, అక్ర‌మ అరెస్ట్ లు చేసినా తన యువ గ‌ళం ఆగ‌ద‌ని స్ప‌ష్టం చేశారు . జ‌న చైత‌న్య‌మే యువ గ‌ళాన్ని వినిపిస్తుంద‌న్నారు. ఇది ఇచ్చాపురం వ‌ర‌కు న‌డిపిస్తుంద‌న్నారు.

Also Read : AP Governor Serious : జ‌డ్జీల‌పై ట్రోలింగ్స్ స‌ర్కార్ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!