PM Modi : ములుగు జిల్లాకు ట్రైబ‌ల్ యూనివ‌ర్శిటీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ

PM Modi : తెలంగాణ – దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త కొంత కాలంగా ఎదురు చూస్తున్న గిరిజ‌న‌, ఆదివాసీల‌కు తీపి క‌బురు చెప్పారు. ఆదివారం ప్ర‌ధాని తెలంగాణ రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ములుగు జిల్లాకు గిరిజ‌న విశ్వ విద్యాల‌యం మంజూరు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

PM Modi Good News to Mulugu People

ఇందు కోసం ఏకంగా రూ.900 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు ప్ర‌జ‌ల సాక్షిగా. ప్ర‌జా సంక్షేమం త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని, అంద‌రూ త‌మ‌కు స‌మాన‌మేన‌ని పేర్కొన్నారు. ఈ కొత్త‌గా ఏర్పాటు చేయ‌బోయే యూనివ‌ర్శిటీకి స‌మ్మ‌క్క సార‌క్క అని పేరు పెడ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రంలో అవినీతి పాల‌న కొన‌సాగుతోంద‌ని, దానిని అంతం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు స‌హ‌కారం అందించాల‌ని కోరారు. మాయ మాట‌ల‌తో క‌ల్ల‌బొల్లి క‌బుర్ల‌తో కాలం వెళ్ల దీస్తున్నార‌ని వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు.

రాబోయే ఎన్నిక‌లు మ‌నంద‌రికీ అత్యంత కీల‌క‌మ‌న్నారు. ఇవాళ అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన పార్టీల‌న్నీ ఒక్క‌టయ్యాయ‌ని, దానికి ఇండియా అని ప్ర‌సిద్ద‌మైన పేరు పెట్టుకున్నాయంటూ ఎద్దేవా చేశారు.

Also Read : Vijay Sai Reddy : చంద్ర‌బాబుకు జైలే గ‌తి

Leave A Reply

Your Email Id will not be published!