Minister KTR : హైద‌రాబాద్ తెలంగాణ గ్రోత్ ఇంజ‌న్

ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్

Minister KTR : హైద‌రాబాద్ – హైద‌రాబాద్ తెలంగాణ‌కు గుండె కాయ లాంటిద‌న్నారు మంత్రి కేటీఆర్(Minister KTR). న‌గ‌రంలో జ‌రిగిన కీల‌క మీటింగ్ లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ప్ర‌పంచంలోని దిగ్గ‌జ కంపెనీల‌న్నీ ఇక్క‌డే కొలువు తీరాయ‌ని చెప్పారు. హైద‌రాబాద్ ఓఆర్ఆర్ రీజిన‌ల్ రింగ్ రోడ్డు ప‌రిధిలో ఉంటుంద‌న్నారు. దీని వ‌ల్ల తెలంగాణ‌లో 50 శాతం క‌వ‌ర్ అవుతుంద‌ని అన్నారు కేటీఆర్.

Minister KTR Praises

బీజింగ్ లో 5 రింగ్ రోడ్లు ఉన్నాయ‌ని తెలిపారు. హైద‌రాబాద్ లో సూర్యా పేట వ‌ర‌కు క‌నెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంద‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్ అనేది న‌గ‌రం కాద‌ని ఇది తెలంగాణ‌కు గ్రోత్ ఇంజ‌న్ గా మారింద‌న్నారు. దీని వెనుక ఎంద‌రో కృషి దాగి ఉంద‌ని చెప్పారు కేటీఆర్.

జీఎన్డీపీలో 45 నుంచి 50 శాతం హైద‌రాబాద్ నుంచే వ‌స్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. రాహుల్ గాంధీ ఓ బ‌ఫూన్ అని ఎద్దేవా చేశారు. ఎవ‌రో రాసి ఇస్తే స్క్రిప్టు చ‌దువుతున్నార‌ని , ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో తామే గెలుస్తామ‌ని, త‌మ‌కు 80 సీట్లు ప‌క్కాగా వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

సురక్షితమైన శాంతి భద్రతలతో ప్రగతి శీల రాష్ట్రంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కలిగి ఉంద‌న్నారు మంత్రి. గ‌త 25 ఏళ్ల‌లో ముగ్గురు సీఎంలు మాత్ర‌మే గుర్తుండి పోతార‌ని అన్నారు. వారిలో దివంగ‌త సీఎం వైఎస్సార్ అయితే మాజీ సీఎం చంద్ర‌బాబు, ప్ర‌స్తుతం కొలువు తీరిన కేసీఆర్ అని వేరే వారు గుర్తుకు రార‌ని అన్నారు.

Also Read : AP CID Notice : టీడీపీకి షాక్ సీఐడీ నోటీస్

Leave A Reply

Your Email Id will not be published!