#RohitSarma : 5000 పరుగుల క్లబ్ లో.. రోహిత్ శర్మ
ఐపీఎల్ మ్యాచ్ లలో అద్భుత పెర్ ఫార్మెన్స్ చూపించిన రోహిత్ శర్మ
Rohit Sarma : ఐపీఎల్ మ్యాచ్ లు ప్రస్తుతం దుబాయ్ లోని అబుదాబిలో జరుగుతున్నాయి. ముంబయి ఇండియన్స్ మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగింది. ఇందులో రోహిత్ శర్మ మూడు సిక్సర్లు కొట్టి..74 పరుగులు చేయడమే కాదు..5000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇందులో ఇప్పటికే 201 సిక్సర్లతో మ్యాచ్ మొదలుపెట్టిన రోహిత్ 204కి చేరుకోవడంతో ఐపీఎల్ లో 200 సిక్సర్ల క్లబ్ లో నాలుగోస్థానానికి చేరుకున్నాడు.
వీళ్లందరికన్నా ముందు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ ఉన్నాడు..ధోనీ 212 సిక్సర్లు సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు డీవిలియర్స్ 214 సిక్సర్లతో ధోనికన్నా ముందున్నాడు. తర్వాత నాలుగోస్థానం రోహిత్ దే.. విరాట్ కొహ్లీ 180 పైగా సిక్సర్లతో వచ్చేస్తున్నాడు. అయితే ఐపీఎల్ మ్యాచ్ లో 5000 పరుగుల మైలు రాయి దాటడం చిన్న విషయమేమీ కాదు..ఎందుకంటే కేవలం 20 ఓవర్లే ఉంటాయి..ప్రతీ బాల్ కి పరుగు తీయాలి.. ఆ కాన్సెప్ట్ తోనే వెళ్లడం వల్ల త్వరగా వికెట్లు నష్టపోవడం జరుగుతుంటుంది. అందువల్ల ఇలాంటి ఫాస్టెస్ట్ మ్యాచ్ లో 5వేల పరుగుల మైలు రాయి గొప్ప విషయమేనని క్రీడా పండితులు పేర్కొంటున్నారు.
ఇందులో ఒక సెంచరీ ఉంది.38 అర్థ సెంచరీలున్నాయి. మొత్తం 192 ఐపీఎల్ మ్యాచ్ ల్లో ఈ ఘనత సాధించాడు. 31.87 సగటు, 131.26 స్ట్రయిక్ రేట్ తో కొనసాగుతున్నాడు. ఏది ఏమైనా ఇండియన్ క్రికెట్ కి రోహిత్ శర్మ ఒక ఆణిముత్యం అని చెప్పాలి. వీరికన్నా ముందు విరాట్ కొహ్లీ 5426 పరుగులతో, సురేష్ రైనా 5368 పరుగులతో రెండోస్థానంలో ఉండటం విశేషం.
