పొరుగు దేశాలపై ఇరాన్ దాడుల ప‌ట్ల‌ ఆగ్ర‌హం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన జీ7 దేశాలు

యూర‌ప్ : పొరుగు దేశాల‌పై ఇరాన్ దాడుల‌కు దిగ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది జి7. తక్షణమే నిలిపి వేయాలని కోరింది . ఇరాన్ చర్యలు ప్రాంతీయ , ప్రపంచ భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయని హెచ్చ‌రించింది. ఈ ఆక్ర‌మ‌ణ‌ల‌ను, దాడుల‌ను త‌క్ష‌ణ‌మే నిలిపి వేయాల‌ని ఆదేశించింది. ఇది పూ్ర్తిగా సార్వ‌భౌమ‌త్వానికి భంగం క‌లిగించడం త‌ప్ప మ‌రోటి కాద‌ని పేర్కొంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇరాన్ యుద్ధం పర్యవసానాలను చర్చించడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ G7 నాయకుల వీడియో కాన్ఫరెన్స్‌కు అధ్యక్షత వహించారు.

జి7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్ , యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ మంత్రులు, యూరోపియన్ యూనియన్ ఉన్నత ప్రతినిధితో కలిసి పొరుగు దేశాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించారు. ఇరాన్, దాని అనుచరులు చేస్తున్న అసమంజ‌స‌మైన దాడులుగా పేర్కొంది.ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ , దాని అనుచరులు చేస్తున్న అన్యాయమైన దాడుల నేపథ్యంలో, ఈ ప్రాంతంలోని త‌మ‌ భాగస్వాములకు మద్దతు తెలియ జేస్తున్నామని పేర్కొన్నారు . బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్ , ఇరాక్‌లలో పౌరులు, ఇంధన సౌకర్యాలతో సహా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులను జి7 మంత్రులు ఖండించారు.

Leave A Reply

Your Email Id will not be published!